- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మై హోం రామేశ్వర్రావుకు బీజేపీ బంపర్ ఆఫర్?
దిశ, తెలంగాణ బ్యూరో :ప్రముఖ పారిశ్రామికవేత్త, మై హోం గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వరరావుకు బీజేపీ బంపర్ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అస్సాం రాష్ట్రం నుంచి ఆయన్ను రాజ్యసభకు ఎన్నిక చేస్తారని రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఇప్పటికే ఆయన బీజేపీకి దగ్గరైనట్లు ప్రచారం జరుగుతోంది. మొన్నటి వరకు కేసీఆర్‌కు వెన్నుదన్నుగా ఉన్న రామేశ్వర్రావు.. కొంతకాలంగా దూరమయ్యారనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను బీజేపీ అస్సాం నుంచి ఎగువ సభకు పంపిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. వాస్తవానికి మైం హోం రామేశ్వర్రావు ఏ ప్రభుత్వంలోనైనా అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలుంటాయి. ఇటీవల ఆధ్యాత్మిక గురువు చినజీయర్ నిర్మించిన సమతామూర్తి విగ్రహా ప్రతిష్టాపనలో కీలకంగా వ్యవహరించిన రామేశ్వరావు.. ఈ విగ్రహా స్థాపన కోసం వంద ఎకరాలు విరాళంగా ఇచ్చిన విషయం తెలిసిందే.
బీజేపీకి దగ్గరయ్యారనే సంకేతమా?
రియల్, నిర్మాణ రంగంతో పాటు పలు వ్యాపారాల్లో ఉన్న మై హోం రామేశ్వర్రావు అన్ని పార్టీలతో సఖ్యత కొనసాగిస్తుంటారు. ఏ ప్రభుత్వంలోనైనా తన పనులు తాను సులువుగా చేసుకునే వెసలుబాటు కల్పించుకుంటారు. అయితే, టీఆర్ఎస్అధికారంలోకి వచ్చిన తర్వాత రామేశ్వర్రావు పాత్ర కీలకంగా మారింది. కేసీఆర్ వెన్నంటి ఉండటమే కాకుండా.. కీలకమైన వ్యవహారాల్లో ఆయనదే కీ రోల్ అని చాలా విమర్శలు సైతం వినిపించాయి. అయితే, తాజాగా ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహ ప్రతిష్టాపన తర్వాత కేసీఆర్‌కు దూరమయ్యారనే ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటుగా బీజేపీ జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు హాజరుకావడంలో రామేశ్వర్రావు సైతం కీలకపాత్ర పోషించినట్లు చెప్పుకున్నారు.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దూరంగా ఉన్నారు. అదే సమయంలో కేంద్రంపైనా సీరియస్గా విమర్శలకు దిగారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినా సీఎం వెళ్లలేదు. ఈ పరిణామాల్లోనే అటు జీయర్, ఇటు జూపల్లి రామేశ్వర్రావుపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఈ ప్రచారానికి బలం చేకూర్చుతూ తాజాగా మరో ప్రచారం జోరందుకుంది. అస్సాం నుంచి రామేశ్వర్రావును రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుతున్నారు. అయితే, దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలకు మాత్రం ఎలాంటి సమాచారం లేదంటున్నారు.
కానీ, రామేశ్వర్రావును బీజేపీ తరుఫున రాజ్యసభకు ఎన్నుకుంటే కొన్ని అంశాల్లో కలిసి వస్తుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామేశ్వర్రావుకు రాజ్యసభ స్థానం కల్పించడంలోనూ చిన జీయర్చక్రం తిప్పుతున్నారనే చర్చ కూడా సాగుతోంది.