KTR తన పరిధి తెలుసుకోవాలి.. గవర్నర్‌కు క్షమాణ చెప్పాలి: BJP

by Javid Pasha |   ( Updated:2022-04-08 11:26:29.0  )
KTR తన పరిధి తెలుసుకోవాలి.. గవర్నర్‌కు క్షమాణ చెప్పాలి: BJP
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌పై రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్‌వవీఎస్ ప్రభాకర్ ఘాటు వాఖ్యలు చేశారు. గవర్నర్ గురించి మాట్లాడే ముందు కేటీఆర్ తన పరిధి తెలుసుకోవాలంటూ విమర్శలు కురిపించారు. గవర్నర్‌పై మాట్లాడించడం కేసీఆర్ బుద్దిని చూపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రబుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, నగరంలోని డ్రగ్స్ కేసుపై ఈడీ చేపట్టి విచారణకు సిట్, టీఆర్ఎస్ సర్కార్ సహాయనిరాకణ చేయడం దారుణం అన్నారు. అంతేకాకుండా డ్రగ్స్ కేసును తమ స్వలాభాల కోసం, బ్లాక్‌మెయిల్ చేసేందుకు వినియోగించుకున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో డ్రగ్స్‌ను అరికట్టడం, వాటి రావాణాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆయన అన్నారు. దాంతో పాటుగా మద్యానికి కళ్లెం వేయడంలోనూ ప్రభుత్వం వైఫల్యం చెదిందని ఆయన ఆరోపించారు.

డ్రగ్స్ కేసులో ఈడీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం సహాయనిరాకరణ చేసపట్టిన సీఎస్‌కు హైకోర్లు నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే సీఎస్‌ను, ఎక్సైజ్ శాఖ కమిషనర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌ను తీవ్రంగా అవమానిస్తుందని, అంతేకాకుండా తమ వాదనలను సమర్థించుకుంటోందని అన్నారు. వెంటనే గవర్నర్‌ను అవమానించిన ప్రతి ఒక్కరు క్షమాపణలు కోరాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed