వరవరరావుకు మధ్యంతర బెయిల్ పొడగింపు..

by Manoj |
వరవరరావుకు మధ్యంతర బెయిల్ పొడగింపు..
X

న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమ కారుడు వరవరరావుకు సుప్రీంకోర్టు ఉపశమనం కల్పించింది. బీమా కోరెగావ్ హింస కేసులో మధ్యంతర బెయిన్ ను మంగళవారం పొడగించింది. న్యాయమూర్తులు యూయూ లలిత్, ఎస్ రవీంద్ర భట్, సుధాన్షు ధులియాలతో కూడిన ధర్మాసనం వైద్యపరమైన కారణాలతో శాశ్వత బెయిల్‌ను కోరుతూ మిస్టర్ రావు చేసిన పిటిషన్‌ను ఈ నెల 19కు వాయిదా వేసింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తరపున హాజరవుతున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తాజా కేసుల్లో హాజరు కావాల్సి ఉన్నందున మరుసటి రోజుకు వాయిదా వేయాలని కోరారు. లొంగిపోవడానికి రావుకు బొంబాయి హైకోర్టు మంజూరు చేసిన గడువు మంగళవారంతో ముగియనుండడంతో మధ్యంతర రక్షణను పొడిగించవచ్చని మెహతా చెప్పారు.

దీనిపై వరవరరావు తరఫున న్యాయవాది ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. ఇరువర్గాల విజ్ఞప్తి మేరకు విచారణను 19కు వాయిదా వేస్తున్నాం. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పిటిషనర్ కు మధ్యంతర బెయిల్ రక్షణగా ఉంటుంది అని బెంచ్ పేర్కొంది. కాగా, అనారోగ్య కారణాలతో తనకు బెయిల్ మంజూరు గతంలో వరవరరావు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కోర్టు తిరస్కరించడంతో, సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనిపై కోర్టు విచారణను ఈ నెల 19కు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed