కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్

by samatah |   ( Updated:2022-03-20 05:53:31.0  )
కస్టమర్లకు అలర్ట్.. వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్
X

దిశ, వెబ్‌డెస్క్ : బ్యాంకులో అత్యవసరంగా ఏమైనా పని ఉందా.. లేక బ్యాంక్‌ పనిని వాయిదా వేస్తున్నారా..అలాంటి వారికి ముఖ్య గమనిక. బ్యాంకు సెలవులను తెలుసుకోవడం ఖాతాదారులకు చాలా అవసరం. కొంత మందికి సెలవుల విషయం తెలియకపోవడంతో కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడటంతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాంటి వారికోసం ఈ సమాచారం. ఈ నెల (మార్చి)లో నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని బ్యాంకులకు ఈ నెల 26 నుంచి 29 వరకు సెలవులు ఉండనున్నాయి.

బ్యాంకుల సెలవులు

28,29 - బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

26-నాలుగో శనివారం

27-ఆదివారం

Advertisement

Next Story