- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డ్రగ్స్ దందాలో సగం టీఆర్ఎస్ నాయకులే.. దమ్ముంటే వారిని అరెస్ట్ చేయండి: బండి సంజయ్
దిశ, షాద్ నగర్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో సగం డ్రగ్స్ దందా టిఆర్ఎస్ నాయకులదేనని వాళ్ల పేర్లు చెబితే వాళ్లను పట్టుకునే దమ్ము ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉందా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు.రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ అధినేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రైమ్ మినిస్టర్ 2022 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమాన్ని బండి సంజయ్ ఆదివారం జ్యోతి ప్రజ్వలనతో లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. గత ఏడేళ్లుగా తెలంగాణలో డ్రగ్స్ దందాను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని,హైదరాబాద్ సిటీ లో డ్రగ్స్ దందా కొనసాగిస్తున్న వారిలో సగం మంది టీఆర్ఎస్ నాయకులకు సంబంధించినవే అని, వారి పేర్లను చెబితే వాళ్లను పట్టుకుని జైలుకు పంపుతారా? అని కేసీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎంతోమంది ఉద్యమకారులు శ్రీకాంత్ చారి, సుమన్ లాంటివాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తే వచ్చిన తెలంగాణను మద్యం, డ్రగ్స్ తదితర మత్తుపదార్థాల రాష్ట్రంగా కేసీఆర్ మార్చారని విమర్శించారు. డబల్ బెడ్ రూమ్, వరి ధాన్యం ఇతర సమస్యల విషయంలో ప్రశ్నిస్తే కేసులు జైళ్లు అంటున్నారని తనకు జైళ్లు కొత్త కాదని, ఐదు సంవత్సరాల్లో ఏడు సార్లు జైలుకు వెళ్లిన అనుభవం ఉందని, దేశం కోసం ధర్మం కోసం న్యాయం కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి, ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
బీజేపీ జాతీయ నాయకురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ వచ్చాక క్రీడల పట్ల గ్రామీణ ప్రాంతాలకు ఎక్కువ అవగాహన పెరిగిందని, గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా కృషి చేస్తున్న ఏకైక ప్రభుత్వం బీజేపీ అని కొనియాడారు. పాలమూరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజకవర్గంలోనే 403 క్రికెట్ టీమ్స్‌ను గుర్తించి టోర్నమెంట్‌లో పాల్గొనెలా చేయడం అద్భుతం అని కొనియాడారు. బీజేపీ జాతీయ పార్టీ నాయకులు ఏపీ జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు. కేసీఆర్‌కు క్రికెట్ అంటే తెలియదని ఎద్దేవా చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ చైర్మన్ గురువారెడ్డి,షాద్ నగర్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇంచార్జ్ శ్రీ వర్ధన్ రెడ్డి,రాష్ట్ర యువ నాయకులు ఏపీ మిథున్ రెడ్డి, శాంతి కుమార్ రెడ్డి, అనూష, కొప్పుల భాష, అందే బాబయ్య, మద్దూరి అశోక్ గౌడ్, వెంకటేష్ గుప్త, పాత పల్లి కృష్ణారెడ్డి, ఆవోపా నేత మల్లిపెద్ది శంకర్, భాస్కర్, మోహన్ సింగ్, శ్యాంసుందర్ రెడ్డి, శ్రీరాములు యాదవ్, కృష్ణారెడ్డి, ఆకుల ప్రదీప్, వంశీకృష్ణ, మల్చాలం మురళి, మఠం రుషికేశ్ తదితరులు పాల్గొన్నారు.