Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిందిగా.. గేమ్ ఛేంజర్ పాటకు ఏకంగా K పాప్ సింగర్ స్టెప్పులు

by Anjali |
Ram Charan : గ్లోబల్ స్టార్ రేంజ్ ఎక్కడికో వెళ్లిందిగా.. గేమ్ ఛేంజర్ పాటకు ఏకంగా K పాప్ సింగర్ స్టెప్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న గేమ్ ఛేంజర్ చిత్రం కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు సాంగ్స్ విడుదలై.. సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా రా మచ్చ రా మచ్చ పాట అయితే జనాల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే రీసెంట్ గా రా మచ్చ సాంగ్ కు ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ పార్క్ మిన్ జున్ తన టీమ్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ నెట్టింట హంగామా సృష్టిస్తున్నారు. రామ్ చరణ్ ను గ్లోబల్ స్టార్ అనడంలో తప్పేంలేదంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక పారక్ మిన్ జున్ ఔరా అనే స్టేజ్ పేరుతో కొరియాలో ప్రముఖ సింగర్. ఎన్నో దేశాలు తిరిగి అక్కడి సాంప్రదాయాలు చూసి నేర్చుకున్నారు. ఏ సాంగ్స్ కు అయినా డ్యాన్స్ చేస్తూ మరింత స్టార్ గుర్తింపు దక్కించుకున్నారు. ఈయన గతంలో కూడా ఇండియన్ పాటలకు స్టెప్పులేసి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యారు. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సాంగ్ కు వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed