- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ తరం ప్రేమకథలపై ఇంట్రెస్టింగ్ ఆంథాలజీ..
దిశ, ఫీచర్స్ : భాష కనిపెట్టకముందే, మాట్లాడటం రాకముందే మనుషులు ప్రేమించుకున్నారు. నిజానికి మాటల్లో అర్థంకాని ప్రేమ మౌనంలో అర్థమవుతుందంటారు. ఎవరికి ఎలా అర్థమైనా మోడ్రన్ ఎరాలో మాత్రం ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఒక్కో విధంగా నిర్వచిస్తున్నారు. కొందరు సాన్నిహిత్యంలో, సరదా కబుర్లలో ప్రేమను వెతుక్కుంటుంటే.. ఇంకొందరు బ్రేకప్, శాక్రిఫైస్‌లో ఆ ఫీలింగ్ అనుభవిస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం.. పొందే వరకు చూపిన గాఢత అందగానే ఆవిరైపోతోంది. కొన్నిరోజులు దగ్గరగా గడిపితే స్పార్క్ మాయమైపోతోంది. అందుకే ఇపుడు 'లివింగ్ రిలేషన్స్, వన్ నైట్ స్టాండ్స్' మోడ్రన్ లవ్‌కు కొత్త భాష్యం చెబుతున్నాయి. కానీ జనరేషన్ థాట్స్, కల్చర్.. 'సోల్‌మేట్' అన్వేషణను కన్‌ఫ్యూజ్ చేస్తున్నాయి. మరి ఇన్ని డిఫరెంట్ ఒపీనియన్స్, ఇంటలెక్చువల్ కాలిక్యులేషన్స్ నడుమ 'సోల్‌మేట్' కాన్సెప్ట్ వర్కవుట్ అవుతుందా? పేగు బంధాలు, భవిష్యత్ భయాల వెనకున్నదీ ప్రేమేనా? ఇలాంటి సున్నితమైన అంశాలకు మెట్రో సిటీ నేపథ్యాన్ని జోడించిన ఆరు కథల సమాహారమే 'మోడ్రన్ లవ్ హైదరాబాద్' ఆంథాలజీ.
My Unlikely Pandemic Dream Partner
ముస్లిం యువతి నూర్ హుస్సేన్(నిత్యా మీనన్) మతాంతర వివాహం చేసుకోవడంతో ఫ్యామిలీకి దూరమవుతుంది. కుటుంబ సభ్యులతో ఎలాంటి సంబంధాలు ఉండవు. అయితే నూరి మోకాలికి సర్జరీ జరగడంతో ఆమె తల్లి మెహరున్నీసా(రేవతి) ఆరేళ్ల తర్వాత మొదటిసారి తనను చూసేందుకు వస్తుంది. సరిగ్గా అప్పుడే కరోనా లాక్‌డౌన్ ప్రకటించడంతో కూతురి దగ్గరే ఇరుక్కుపోతుంది. కూతురి మతాంతర పెళ్లి మూలంగానే బెంగపెట్టుకుని భర్త చనిపోయాడనేది తల్లి కోపం. తన లైఫ్ తనకు నచ్చినట్లుగా ఉండాలన్నది కూతురి క్లారిటీ. కొంతకాలంగా ఇద్దరిలో గూడు కట్టుకున్న కోపాన్ని.. లాక్‌డౌన్ డేస్ కరిగించాయా? ఓ వైపు భర్త పోయిన దుఖంలో ఉన్న తల్లి, అప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న కూతురి జీవితాల్లో మళ్లీ ప్రేమ చిగురించిందా? గత జ్ఞాపకాలు ఇద్దరి మధ్యన అంతరాన్ని తగ్గించాయా? అనేది కథ. హైదరాబాద్ ముస్లిం ట్రెడిషనల్ వంటకాలు, సిటీ కల్చర్ నేపథ్యంతో పాటు ఫ్రెండ్లీగా విడిపోతున్న ఈ తరం జంటలను, మోడ్రన్ కల్చర్.. పేరెంట్స్‌లో తీసుకొస్తున్న మార్పులను హృద్యంగా చూపించారు.
డైరెక్టర్ : నగేష్ కుకునూర్
Fuzy Purple and Full of Thrones
ఊహించనివిధంగా గుడిలో కలుసుకున్న రోహన్(ఆది పినిశెట్టి), రితూ వర్మ(రేణు).. ఫస్ట్ మీటింగ్‌లోనే ఒకరినొకరు ఇష్టపడతారు. తమ గత బ్రేకప్స్‌ను మరిచిపోయి లివింగ్ రిలేషన్ స్టార్ట్ చేస్తారు. రెండేళ్ల వరకు సాఫీగా సాగిన వీరి ప్రయాణం.. ఆ తర్వాత డిస్టర్బ్ అవుతుంది. రోహన్ తన మాజీ లవర్ చెప్పులను కప్‌బోర్డ్‌లో దాచుకోవడమే అందుకు కారణం. అది చూసిన రేణు తట్టుకోలేకపోతుంది. అనుమానంతో వేధిస్తుంది. సర్దిచెప్పినా పట్టించుకోదు. మరోవైపు వీరి లివింగ్ రిలేషన్‌పై గుర్రుగా ఉండే ఓల్డ్ జనరేషన్ పేరెంట్స్ నుంచి పెళ్లి చేసుకోమనే ఒత్తిడి. ఈ హర్డిల్స్‌ను వాళ్లిద్దరూ ఎలా అధిగమించారు? బ్రేకప్‌నే సొల్యూషన్‌గా ఎంచుకున్నారా? లేదా మ్యారేజ్ చేసుకున్నారా? అనేది మిగతా స్టోరీ. సిటీల్లో పెరుగుతున్న లివింగ్ రిలేషన్‌షిప్స్‌ను, మాజీలకు గుర్తుగా దాచుకున్న వస్తువులు తెచ్చే ఇబ్బందులను తెరపై సరదాగా ఆవిష్కరించారు.
డైరెక్టర్ : నగేష్ కుకునూర్
Why did she leave me there..?
పేరెంట్స్ చనిపోవడంతో రాములు(నరేష్ అగస్త్య)తో పాటు అతడి అక్కను అమ్మమ్మ గంగమ్మ(సుహాసిని) పెంచుతుంది. ఇండ్లల్లో పనిచేసుకుంటూ వారిద్దరినీ సాకుతుంది. అనుకోకుండా ఒక యాక్సిడెంట్‌లో రాములు అక్క చనిపోతుంది. మరోవైపు గంగమ్మ ఆరోగ్యం క్షీణిస్తుంటుంది. దీంతో రాములును ఆర్ఫనేజ్ హోమ్‌లో చేర్చించి వెళ్లిపోతుంది గంగమ్మ. అప్పటి నుంచి అమ్మమ్మ కోసం రోజుల తరబడి ఎదురుచూస్తాడు రాములు. ఆమె రాకపోవడంతో కోపం పెంచుకుంటాడు. కష్టపడి చదివి ఓ కంపెనీకి సీఈవోగా ఎదుగుతాడు. ఓసారి తన బర్త్‌డే సందర్భంగా అదే అనాథాశ్రమానికి వెళ్లిన రాములుకు తన గత జ్ఞాపకాలు ఎలాంటి ఓదార్పునిచ్చాయి? అమ్మమ్మ తనను ఎందుకు వదిలి వెళ్లిందో నిజం తెలిసిందా? తెలియాలంటే ఈ ఆంథాలజీ తప్పక చూడాల్సిందే. ఈ స్టోరీలో హైదరాబాద్ బస్తీవాసుల ప్రేమలు, త్యాగాలు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించి హృదయాన్ని బరువెక్కిస్తాయి. అంతేకాదు గెలవాలన్న కసి ఉంటే.. ఆర్థిక కష్టాలు, వైకల్యాలు, మరే కారణమూ అడ్డుకాదనే విషయాన్ని బలంగా చూపించాడు దర్శకుడు.
డైరెక్టర్ : నగేష్ కుకునూర్
What Clown wrote this script
ఒక టీవీ చానల్‌లో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసే అశ్విన్(అభిజిత్).. స్టీరియోటైప్స్ బ్రేక్ చేసే కంటెంట్‌తో పోగ్రామ్ డిజైన్ చేయాలనుకుంటాడు. అదే టైమ్‌లో తనకు స్టాండప్ కమెడియన్‌గా రాణిస్తున్న వందన(మాళవిక) పరిచయం అవుతుంది. ఇద్దరూ కలిసి ఫ్రెష్ కంటెంట్‌తో 'తెలుగు మ్యాన్' పేరుతో సిరీస్ ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలోనే ఒకరికొకరు అట్రాక్ట్ అవుతారు. కానీ ప్రోగ్రామ్ షూట్ సమయానికి యాక్టర్‌ను మార్చేస్తుంది చానల్ యాజమాన్యం. ఇలాంటివి జరగకుండా చూస్తానని ముందే ప్రామిస్ చేసిన అశ్విన్.. వందనకు ఏం సమాధానం చెప్పాడు? ప్రొఫెషనల్ గ్యాప్.. పర్సనల్ రిలేషన్‌ను ఎలా బ్రేక్ చేసింది? మళ్లీ కలిశారా? లేదా అన్నది మిగతా స్టోరీ. ప్రజెంట్ జనరేషన్ అబ్బాయిలు, అమ్మాయిల మధ్య ప్రొఫెషనల్ జర్నీలో రిలేషన్‌షిప్స్ ఎలా ఏర్పడుతున్నాయి? క్రియేటివ్ ఫీల్డ్ వాటిని ఎలా ప్రభావితం చేస్తుంది? ఇండిపెండెంట్ గర్ల్స్ ఏం కోరుకుంటున్నారు? అనే పాయింట్‌ను ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.
డైరెక్టర్ : ఉదయ్ గుర్రాల
About the rustle in bushes
శ్రీధర్(నరేష్).. కూతురిపై అమితమైన ప్రేమ కలిగిన తండ్రి. స్నేహ(ఉల్కా గుప్తా) తల్లిదండ్రుల రూల్స్‌తో విసిగెత్తిపోయిన నవతరం మహిళ. తనకు కాబోయేవాడిని తానే వెతుక్కునే ప్రయత్నాల్లో ఉంటుంది. అయితే కూతురికి ఎక్కడికి వెళ్లినా తెలియకుండా ఫాలో అవుతుంటాడు శ్రీధర్. చివరకు ఒకరోజు తండ్రి దొంగచాటుగా చెట్ల పొదల వెనక నుంచి తనను గమనిస్తున్నాడని స్నేహకు తెలిసిపోతుంది. అప్పుడు స్నేహ రియాక్షన్ ఏంటి? అప్పటివరకు తను కలిసిన అబ్బాయిలతో ఆమె ఏం చేసేది? అనే అంశాలను ఆసక్తికరంగా చిత్రీకరించారు. తల్లిదండ్రుల ప్రేమ మితిమీరితే ఎలా ఉంటుందనే అంశంతో పాటు వాళ్ల తపనంతా పిల్లల భవిష్యత్ బాగుండాలనే! అనే విషయాన్ని చక్కగా తెరకెక్కించారు.
డైరెక్టర్ : దేవిక
Finding your Penguin
మైక్రోబయాలజిస్ట్ అయిన ఇందు(కోమల ప్రసాద్)కు ఒకరితో బ్రేకప్ అవుతుంది. నిజానికి ఎలాంటి పార్ట్‌నర్ కావాలో తెలియని కన్‌ఫ్యూజన్ తనది. ఈ క్రమంలోనే తను సోల్‌మేట్‌ను వెతుక్కునే ప్రయత్నాలన్నీ విఫలమవుతుంటాయి. చివరకు తండ్రి బలవంతం మీద ఆయన ఫ్రెండ్ కొడుకును కలుస్తుంది. కొద్దిరోజుల పాటు అతడితో కలిసి తిరిగినప్పటికీ ప్రపోజ్ చేస్తే మాత్రం తిరస్కరిస్తుంది. దాని వెనక బలమైన కారణం ఏదైనా ఉందా? లేక ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ గుర్తొచ్చాడా? ఇంతకీ ఇందుకు సోల్‌మేట్ దొరికాడా? లేదా అనేది ఇంట్రెస్టింగ్‌గా చూపించారు. సోల్‌మేట్ విషయంలో ఈ జనరేషన్ ఎదుర్కొంటున్న కన్‌ఫ్యూజన్ ఆధారంగా అల్లుకున్న ఈ కథ రియాలిటీకి అద్దంపట్టింది. తాము అనుకున్న క్వాలిటీస్ ఉన్నవారి కోసం జల్లెడ పడుతూ వారినే సోల్‌మేట్‌గా భావించడం పొరపాటని.. సరైన వ్యక్తి తారసపడితే ఆటోమేటిక్‌గా ప్రేమ పుడుతుందని క్లారిటీ ఇచ్చారు.
డైరెక్టర్ : వెంకటేష్ మహా