ఆకాశం నుంచి ఊడిపడ్డ భారీ ఉల్క.. వీడియో వైరల్

by Manoj |   ( Updated:2023-05-01 06:32:56.0  )
ఆకాశం నుంచి ఊడిపడ్డ భారీ ఉల్క.. వీడియో వైరల్
X

దిశ, ఫీచర్స్ : ఈ అనంత విశ్వం అంతుచిక్కని ఎన్నో రహస్యాలకు వేదిక. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికీ అనేక విషయాలు సైంటిస్టులకు సవాల్ విసురుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆకాశం నుంచి తెగిపడిన భారీ సైజు ఉల్కలు భూమిపై పడటం గురించి వినే ఉంటారు. కానీ అవి ఎప్పుడు? ఎక్కడ? పడతాయో మాత్రం ఎవరికీ తెలియదు. రకరకాల సైజుల్లో నేలరాలుతూ ఆశ్చర్యపరుస్తుంటాయి. రీసెంట్‌గా భారీ ఉరుములు, శబ్దంతో ఆకాశం నుంచి భూమిపైకి దూసుకొచ్చిన ఒక పెద్ద ఉల్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చిలీ రాజధాని శాంటియాగో మీదుగా రాత్రిపూట ఆకాశం నుంచి తెగిపడ్డ ఉల్కాపాతం ఫ్లాష్ లైట్ల వలె మెరిసి నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇలా భారీ ఉరుములు, శబ్దాలతో దూసుకొచ్చిన ఉల్కను 'T12.cl'గా పిలుస్తారని సైంటిస్ట్ జువాన్ కార్లోస్ బీమిన్ తెలియజేశారు. అది వాతావరణంలోకి ప్రవేశించినపుడు ఏదైనా చిన్న రాయి లేదా గాలితో ఘర్షణ కారణంగా కాలిపోయి ప్రకాశిస్తుందని చెప్పారు. అంతేకాదు అది గంటకు 10 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed