- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోహన్నెస్‌బర్గ్ బార్‌లో కాల్పులు.. 14 మంది స్పాట్ డెడ్
కేప్ టౌన్: దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. శనివారం రాత్రి గుర్తుతెలియని కొందరు దండగులు మినీ ట్యాక్సీ కారులో వచ్చారు. బార్‌లోకి ప్రవేశించి.. బార్‌లో ఉన్న కస్టమర్లమై కాల్పులు జరిపారు. దీంతో భయాందోళనకు గురైన బాధితులు పరిగెత్తడానికి ప్రయత్నించారు. అయినా దండగులు కాల్పుల వర్షం ఆపలేదు.బార్ మొత్తం మృతదేహాలు, రక్తపు మడుగులతో నిండిపోయింది. ఆదివారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
కాల్పుల్లో 14 మంది మరణించినట్లు పోలీసులు తెలిపారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని.. వారు ప్రస్తుతం క్రిస్‌హనీ బరగ్వానాథ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారన్నారు. అలాగే మృతదేహాలను మార్చరీకి తరలించామన్నారు. గ్రూపులుగా వచ్చి.. బార్‌లో కాల్పులు జరిపారని గౌటెంగ్ ప్రావిన్స్ పోలీస్ కమిషనర్ లెఫ్టినెంట్ జనరల్ ఎలియాస్ మావెలా తెలిపారు. అయితే దుండగులు ఆకస్మాత్తుగా ప్రవేశించి కాల్పులు జరిపారని, ఏ కారణంతో కాల్పులు జరిపారనే విషయంపై స్పష్టత లేదన్నారు. కేసు దర్యాప్తులో ఉందని, మరిన్నీ వివరాలు త్వరలో వెల్లడిస్తామని లెఫ్టినెంట్ జనరల్ మావెలా తెలిపారు.