రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత

by GSrikanth |   ( Updated:2023-10-17 07:44:03.0  )
రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం కేసీఆర్‌కు విసిరిన ఛాలెంజ్ మేరకు ఇవాళ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం వద్దకు రాగ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ పేరుతో అడ్డుకోగా పోలీసులతో రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. కాగా ఎన్నికల్లో మద్యం, డబ్బులు పంచకుండా ఓట్లు అడుగుతామని ప్రమాణం చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమా అంటూ రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అక్టోబర్ 17వ తేదీన తాను అమరవీరుల స్థూపం వద్దకు ప్రమాణం చేసేందుకు వస్తానని ప్రకటించారు.

Advertisement

Next Story