Lasya Nanditha : ఆ ముగ్గురికి కేసీఆర్ షాక్.. సీఎం ఆశీసులు లాస్యకే

by Nagaya |
Lasya Nanditha : ఆ ముగ్గురికి కేసీఆర్ షాక్.. సీఎం ఆశీసులు లాస్యకే
X

దిశ,కంటోన్మెంట్ : కంటోన్మెంట్ ఎమ్మెల్యే టికెట్‌ను దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకే దక్కింది. సాయన్న మరణం వివాదానికి కారణమైన విషయం విధితమే. అధికార పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించలేదని ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల అసెంబ్లీలో సాయన్న సంతాప తీర్మాణం ప్రవేశపెట్టిన సందర్భంలో సీఎం కేసీఆర్ సాయన్న కుటుంబ సభ్యులకు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ వల్లనే లాస్య నందితకు టికెట్ కేటాయించారు.

సాయన్న మరణంతో...

సాయన్న అకాల మరణంతో ఎమ్మెల్యే టికెట్ పై ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మన్నే క్రిశాంక్, గజ్జెల నగేష్ లతోపాటు పార్టీ సీనియర్ నేత శ్రీ గణేష్ కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎర్రోళ్ల శ్రీనివాస్ కంటోన్మెంట్ లో బస్తీ దవాఖానల ఏర్పాటు,ఇతరాత్ర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టగా,మన్నే క్రిశాంక్ బస్తి నిద్రలు,యువతతో ఇంటారక్ట్ అవుతూ పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా గజ్జెల నగేష్ తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్లి, ప్రచారాన్ని కొనసాగించారు. ఇక శ్రీ గణేష్ అయితే గత పార్లమెంట్ ఎన్నికల నాటి నుంచి తన సొంత డబ్బులను వెచ్చిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. శ్రీ గణేష్ ఫౌండేషన్ పేరిట పలు కార్యక్రమాలను నిర్వహించారు. అయినా వీరికి కాకుండా దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తె లాస్య నందితకే బీఆర్ఎస్ పట్టం కట్టింది. దీంతో నలుగురు ఆశావహులకు నిరాశే మిగిలింది.

Advertisement

Next Story

Most Viewed