- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యూకేలో భారత సంతతి మహిళ హత్య.. భర్త కోసం గాలింపు
దిశ, వెబ్ డెస్క్: భారత సంతతికి చెందిన ఓ వివాహిత యూకే (UK)లో దారుణంగా హత్యకు గురైంది. 24 ఏళ్ల హర్షితా బ్రెల్లా డెడ్ బాడీని ఈస్ట్ లండన్ (East London)ఏరియాలో పార్క్ చేసి ఉన్న కారులో పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. భర్తే చంపేసి పరారై ఉంటాడని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. ప్రస్తుతం అతను దేశం విడిచి పారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. హర్షిత మిస్సింగ్ పై బుధవారం ఆమె ఫ్రెండ్స్ కంప్లైంట్ ఇచ్చారని, దాని ఆధారంగానే ఆమె ఆచూకీ కోసం వెతుకుతుండగా మృతదేహం దొరికిందని పోలీసులు తెలిపారు. ఇల్‌ఫోర్డ్ ప్రాంతంలోని బ్రిస్బేన్ రోడ్‌లోని ఓ కారులో గురువారం హర్షిత మృతదేహాన్ని గుర్తించినట్లు తెలిపారు.
నార్తాంప్టన్ షైర్ (Northamptonshire) పోలీసులు.. ఈ కేసులో 60 మంది పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. నిందితుడిగా భావిస్తున్న పంకజ్ లాంబ చిత్రాన్ని కూడా రిలీజ్ చేసినట్లు పేర్కొన్నారు. హర్షితను చంపేసిన అనంతరం ఆమె మృతదేహాన్ని నార్తాంప్టన్ షైర్ నుంచి ఇల్ ఫోర్డ్ కు కారులో తరలించి, ఆ కారును అక్కడే వదిలేసి దేశం వదిలి పారిపోయినట్లు తెలుస్తోందని, డిటెక్టివ్ లు అతడిని పట్టుకునే పనిలో ఉన్నారని వెల్లడించారు. నిందితుడు ఫొటో చూసినవారు అతనెవరికైనా తెలిస్తే చెప్పాలని కోరారు.