DK Aruna: రేవంత్‌కు ప్రజల కంటే ఫార్మా కంపెనీలే ముఖ్యమా.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2024-11-18 08:32:45.0  )
DK Aruna: రేవంత్‌కు ప్రజల కంటే ఫార్మా కంపెనీలే ముఖ్యమా.. డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్/సంగారెడ్డి: లగచర్ల ఘటనను కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసి చేయించిన ఘటన అని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. సోమవారం సంగారెడ్డి కేంద్ర కారాగారంలో ఉన్న లగచర్ల బాధితులను ఎంపీ డీకే అరుణతో కలిసి పరామర్శించారు. ఈ సందర్బంగా ఈటెల రాజేందర్ విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ వాళ్లే ఈ ఘటనకు స్కెచ్ వేసుకుని ఈ దాడులు చేయించారని విమర్శించారు. ప్రభుత్వం అవసరాల కోసం భూములు తీసుకోవడం వేరు, కానీ బడా కంపెనీలకు అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ సోదరుడి అరాచకాలు నియోజకవర్గంలో ఎక్కువ అయ్యాయని, నియంతలకు సందర్భం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుందని హెచ్చరించారు.

రైతుకు సంకెళ్లు, థర్డ్ డిగ్రీ చేయడం కరెక్ట్ కాదని, ప్రజల కన్నీళ్లు చూసినవాడు ఎప్పుడు బాగుపడడని హెద్దెవా చేశారు. రైతులపై దుర్మార్గంగా ప్రవర్తించి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బేషరతుగా ప్రభుత్వం బాధితులకు క్షమాపణ చెప్పి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై దాడి చేస్తే పరామర్శించేందుకు వెలితే పార్టమెంట్ సభ్యులను సైతం అనుమతించలేదని, 144 సెక్షన్ పెట్టి ప్రజాప్రతినిధులను అక్కడికి వెళ్లకుండా ఆపుతున్నారని, నీకు అక్కడ ఏముందని పెత్తనం చేలాయిస్తున్నావ్ సీఎం అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్‌లో ప్రివిలేజ్ మోషన్ వేస్తామని హెచ్చరించారు. అధికారులు చట్టాన్ని పక్కన పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. అమాకులపై కేసులు పెట్టి జైల్లో వేయండం కలెక్టు కాదని, గతంలో ఖమ్మం రైతులకు సంకెళ్లు వేసిన వారికి పట్టిన గతే మీకు పడుతుందన్నారు.

ఫార్మా కంపెనీపై సీఎంకు ఎందుకంత ప్రేమ.. ఎంపీ డీకే అరుణ

ఓట్లేసి గెలిపించిన ప్రజల కంటే ఫార్మా కంపెనీపై సీఎంకు ఎందుకంత ప్రేమ అని ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వబోమని 8 నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్నారని, బలవంతంగా భూములు లాక్కుంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారన్నారు. రైతులు ప్రజాభిప్రాయ సేకరణను బహిష్కరించారని, కానీ వాస్తవంగా ప్రజాభిప్రాయ సేకరణకి రాకపోతే కలెక్టర్ ఒక్కరే ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పోలీసుల వైఫల్యంతోనే ఈ ఘటన జరిగిందని, సీఎం రరేవంత్ సోదరుడు అక్కడ ఉన్న రైతులను బయపెట్టారన్నారు. భూములు ఎలాగైనా గుంజుకుంటామని చెప్పారని, ఘటన తర్వాత రాత్రి గ్రామాల్లోకి వచ్చి పోలీసులు ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని మండిపడ్డారు. గొడవ జరిగిన ఘటనలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వదిలేసి మిగతా పార్టీల వాళ్ళని గుర్తించి అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంకు ఫార్మా కంపెనీలపై అంత ప్రేమ ఎందుకు అని, ఓటేసి గెలిపించిన జనాల కాంటే మీకు ఫార్మా కంపెనీ ముఖ్యమా సీఎం రేవంత్ అంటూ ప్రశ్నించారు.

భూములు ఇవ్వమని చెబితే సీఎం రేవంత్ స్వయంగా వెళ్లి వాళ్ళని కలిసి మాట్లాడితే బాగుండేదని, కానీ ఇవన్నీ చేయకుండా భయపెట్టి దాడులు చేపించి ఇలా చేయడం కరెక్టు కాదన్నారు. దాడులు జరిగిన తరువాత పరామర్శించేందుకు తాను వెలితే అడ్డుకున్నారని, కానీ సీఎం సోదరుడు అక్కడికి వెళ్ళాడన్నారు. రైతులతో దౌర్జన్యంగా బెదిరించి సంతకాలు పెట్టించుకుంటున్నారని, మీరు సీఎం అయితే మా నియోజకవర్గం బాగుంటుంది అనుకుంటే మీరు జనాలపై కక్ష కట్టారని ఆరోపించారు. సీఎం కొడంగల్ వాసులు కాదని వలస వచ్చారని విమర్శించారు. మీకు నచ్చిన వారికి కంపెనీలు అప్పజెప్పడానికే ఫార్మా కంపెనీలు పెడుతున్నారని, వెంటనే లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పేదల ఉసురు పోసుకున్న కేసీఆర్ ఇంటికి పోయిండని, మీరు 11 నెలలకే పేదల ఉసురు పోసుకుంటున్నారని హెద్దెవా చేశారు. అదే విధంగా మూసి ప్రజల ఉసురు కూడా పోసుకోవడం కరెక్ట్ కాదన్నారు. సీఎం రేవంత్ అహంకారం వీడాలని, రైతులను ఒప్పించి భూములు తీసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రావు దేశ్ పాండే, కొండాపురం జగన్, మందుల నాగరాజు, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed