KTR : స్థానిక సంస్థల చట్టాల సవరణల్ని వ్యతిరేకిస్తున్నాం : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |
KTR : స్థానిక సంస్థల చట్టాల సవరణల్ని వ్యతిరేకిస్తున్నాం : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government)ప్రవేశపెట్టిన స్థానిక సంస్థల(local Bodies) చట్టాల సవరణల్ని మేం వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)స్పష్టం చేశారు. అసెంబ్లీ లాబీలో కేటీఆర్ మాట్లాడుతూ చట్ట సవరణతో బీసీలకు అన్యాయం జరుగుతుందని, 42 శాతం హమీ గంగలో కలిసినట్టేనన్నారు. నేరుగా చట్టంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని సవరణలు కోరామని తెలిపారు. ఒకవేళ ఈ చట్టం అమలైతే.. బీసీలకు రిజర్వేషన్లు దక్కవన్నారు.

ఫార్ములా ఈ-రేసు, ఇతర స్కాములంటూ అసత్య ప్రచారాలు చేయడం కాదని, దమ్ముంటే.. అసెంబ్లీలో చర్చ పెట్టండి, అప్పుడే అసలు నిజాలు తెలుస్తాయని మరోసారి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నిజాలు చెప్పే దమ్ము లేక.. సీఎస్‌తో నోటీసులు, గవర్నర్ అనుమతులంటూ లీకులిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed