MLC Kavitha: కేటీఆర్‌‌పై కేసు.. ఎక్స్‌లో ఫోటో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత

by Ramesh N |
MLC Kavitha: కేటీఆర్‌‌పై కేసు.. ఎక్స్‌లో ఫోటో షేర్ చేసిన ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌ (Formula-E car racing) వ్యవహారంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ (KTR)ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ తాజాగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) గురువారం ఎక్స్ వేదికగా స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక (BRS) బీఆర్‌ఎస్ పార్టీ,(KCR) కేసీఆర్‌‌ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ ప్ర‌భుత్వం బ‌నాయిస్తున్న అక్ర‌మ కేసుల డ్రామాను తెలంగాణ ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పేర్కొన్నారు.

అసెంబ్లీలో చర్చకు ధైర్యం చేయలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy).. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులతో భయభ్రాంతులకు గురి చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం రాజకీయ అమాయకత్వం తప్ప మరొకటి కాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి దయచేసి తెలుసుకోండి.. మేము కేసీఆర్‌కి సైనికులం.. తెలంగాణ ఉద్యమ పోరాటం నుంచి పుట్టామని అన్నారు. మీ చిల్ల‌ర‌ వ్యూహాలు మమ్మల్ని భయపెట్టవు.. అవి మా సంకల్పానికి మ‌రింత బ‌లం చేకూరుస్తాయని అన్నారు. పోరాటం మాకు కొత్త కాదు.. అక్ర‌మ కేసుల‌తో మా గొంతుల‌ను నొక్క‌లేరని వెల్లడించారు. ఈ క్రమంలోనే అన్న కేటీఆర్‌తో దిగిన ఫోటోను ఎమ్మెల్సీ కవిత షేర్ చేశారు.

Advertisement

Next Story