- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రాక్టర్ ప్రమాదంలో యువకుడు మృతి
దిశ,దుబ్బాక : ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు కింద పడి యువకుడు మృతి చెందిన ఘటన దుబ్బాక మండలం శివాజీ నగర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వి.గంగరాజు తెలిపిన వివరాల ప్రకారం...శివాజీ నగర్ గ్రామానికి చెందిన పెంబర్తి రాకేష్ (23) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేసేవాడు. బుధవారం రాత్రి వెంకటగిరి తండాకు చెందిన అజ్మీర కమల్ అనే వ్యక్తి నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించి మట్టి తోడేందుకు తన ట్రాక్టర్ను తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు కింద పడడంతో, ట్రాక్టర్ టైర్లు రాకేష్ పైనుంచి వెళ్లగా, తీవ్రంగా గాయపడ్డాడు. జరిగిన ప్రమాదాన్ని గుర్తించిన తోటి ట్రాక్టర్ డ్రైవర్లు వెంటనే రాకేష్ ను చికిత్స నిమిత్తం దుబ్బాక వంద పడకల ఆసుపత్రికి తీసుకురాగా, అక్కడి వైద్యులు పరీక్షించి, రాకేష్ మృతి చెందాడని తెలిపారు. అనంతరం మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం అక్కడే ఉన్న మార్చురికి తరలించారు. మృతుని తండ్రి పెంబర్తి కనకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.