ఈ నెల 22న గవర్నర్ పర్యటన : కలెక్టర్

by Kalyani |
ఈ నెల 22న గవర్నర్ పర్యటన : కలెక్టర్
X

దిశ, మెదక్ ప్రతినిధి : రాష్ట్ర గవర్నర్ విష్ణు దేవ్ వర్మ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఈ నెల 22 ఆదివారం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పర్యటన కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల లో విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో మెదక్ కేథడ్రల్ చర్చ్ లోని ముందస్తు ఏర్పాట్లు కోసం మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసిల్దార్ లక్ష్మణ్ బాబు, చర్చ్ ప్రెసిడెంట్ శాంతయ్య, సెక్రటరీ బోని తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రూట్‌ మ్యాప్‌, పార్కింగ్‌, చర్చి ఆవరణలో ఏర్పాట్లు తదితర అంశాలపై చర్చి నిర్వాహకులు, అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెదక్ పట్టణంలో మెదక్ కేథడ్రల్ చర్చ్ ఈనెల 25వ తారీకు వరకు వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉత్సవాలు నిర్వహించడం లో భాగంగా ఉన్నతాధికారులు తాకిడి మెదక్ జిల్లాలో ఉంటుందని, తెలిపారు. ముందస్తుగా ఈనెల 22వ తారీఖున ఆదివారం గవర్నర్ చర్చి సందర్శిస్తారని, అనంతరం కుల్చారం మండలం సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల లో విద్యార్థినిలతో ముఖాముఖి కార్యక్రమం లో పాల్గొంటున్న నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు కలగకుండా చర్యలు చేపట్టామన్నారు.

Advertisement

Next Story