Mla Ms Raju: టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్

by srinivas |   ( Updated:2024-12-19 13:34:03.0  )
Mla Ms Raju: టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam)పై తెలంగాణ బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్(Telangana BRS leader Srinivas Goud) చేసిన అనుచిత వ్యాఖ్యలకు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎం.ఎస్ రాజు(Madakasira TDP MLA MS Raju) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికిని కాపాడుకునేందుకే శ్రీనివాస్ గౌడ్ అలా మాట్లాడారని కొట్టిపారేశారు. టీటీడీలో ఎలాంటి వివక్షకు తావులేదని తెలిపారు. టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు అర్ధరహితమని చెప్పారు. తిరుమలకు 60 వేల మంది భక్తులు వస్తుంటారని, కులము, ప్రాంతము చూసే పరిస్థితి ఉండదన్నారు. పార్టీ ఉనికి, ఆస్థిత్వం కోసమే టీటీడీపై శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రాంతీయ వాదం, తత్వంతో వచ్చిన పార్టీ నేత శ్రీనివాస్ గౌడ్ అని వ్యాఖ్యానించారు. ఆలయ అధికారులు, పూజలు, ఉద్యోగులు ఎవరిపట్ల వివక్ష చూపారని తెలిపారు. తెలుగు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడటం సరికాదన్నారు. ప్రస్టేషన్‌లో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారని, దేవుడి దగ్గర అందరూ సమానమే విషయాన్ని ఆయన గుర్తు పెట్టుకోవాలని ఎం.ఎస్ రాజు సూచించారు.

Advertisement

Next Story