- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిరిసిల్ల అసైన్డ్ భూముల్లో ‘అగ్గి’ రాజుకుంది..
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: సిరిసిల్ల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో "అగ్గి" రాసుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ అనుచరులు చేసిన భూభాగోతం ఒక్కొక్కటిగా బహిర్గతం అవుతున్నాయి. ప్రభుత్వ భూముల కబ్జా విషయంలో కొంతమంది బీఆర్ఎస్ అగ్రనేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఉదయం నుంచి రాత్రి వరకు సుదీర్ఘ విచారణ జరుగుతున్నట్లు సమాచారం.
విచారణ అనంతరం నిందితులపై పలు సెక్షన్లలో కేసులు నమోదు చేసి, ఇద్దరు లేక ముగ్గురు నేతలను నేడో, రేపో రిమాండ్ కు తరలించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాగా సిరిసిల్లలో బీఆర్ఎస్ నేతల వరుస అరెస్టులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల కేటీఆర్ ముఖ్య అనుచరుడు అరెస్ట్ అయి రిమాండ్ కు వెళ్లి రాగా, తాజాగా మరి కొంతమంది బీఆర్ఎస్ అగ్రనేతలు అరెస్ట్ కావడంపై జిల్లా కేంద్రంలో చర్చ కొనసాగుతోంది. తమ వంతు ఎప్పుడో అంటూ బీఆర్ఎస్ నేతలు గుబులు పడుతున్నట్లు పార్టీ వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి.