CM Chandrababu:ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

by Jakkula Mamatha |
CM Chandrababu:ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) రాష్ట్రాభివృద్ధే(State Development) లక్ష్యంగా దూసుకెళ్తుంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పట్టణాలు, నగరాల్లో 100 గజాల్లో(2 సెంట్లు) ఇల్లు కట్టుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం(Government) శుభవార్త చెప్పింది. మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరగకుండా వారికి ప్లాన్ అప్రూవల్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే 300 గజాల్లోపు ఇల్లు నిర్మించుకునే వారికి అనుమతులు సులభతరం చేయనుంది. కాగా ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిధుల(Central Government Funds)తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.4 లక్షలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story