డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు మీ భద్రత కోసమే

by Naveena |
డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు మీ భద్రత కోసమే
X

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయడం మీ భద్రత కోసమేనని 1 టౌన్ సీఐ అప్పయ్య అన్నారు. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీలు చేయగా..మద్యం సేవించి వాహనం నడిపే వ్యక్తిని గుర్తించి కోర్టులో హాజరుపరించారు. దీంతో రెండవ క్లాస్ మెజిస్ట్రేట్ నిర్మల రెండు రోజుల జైలు శిక్ష,రెండు వేల రూపాయల జరిమానా విధించారని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం రోడ్డు భద్రతకు ముప్పు కలిగించే నేరంగా పరిగణించబడుతుందన్నారు. ఇది ఇతరుల ప్రాణాలకు ప్రమాదాన్ని కలిగించవచ్చని,అందుకే ఇలాంటి కేసుల్లో కోర్టు కఠినమైన శిక్షలు విధించడం ద్వారా జాగ్రత్తలు తీసుకుంటుందని ఆయన వివరించారు. మద్యం తాగి వాహనం నడపడం మీ జీవితానికే ప్రమాదకరమని,ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story