- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Shankar: ఇండియన్-3 థియేటర్‌లోనే.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: దాదాపు 28 ఏళ్ల క్రితం కమల్ హాసన్ (Kamal Haasan), శంకర్ (Shankar) కలయికలో వచ్చిన 'భారతీయుడు' (Indian) చిత్రానికి సీక్వెల్‌గా.. మళ్లీ అదే కాంబినేషన్‌లో మరింత గ్రాండియర్‌గా రూపొందిన మూవీ 'భారతీయుడు-2' (Indian-2). బిగ్‌బడ్జెట్‌తో, స్టార్ వాల్యూస్‌తో తెరెకెక్కిన ఈ సినిమా ఎన్నీ అంచనాల మధ్య రిలీజై ఫుల్ నెగిటివిటీ (negativity)ని సొంతం చేసుకుంది. చాలా ట్రోల్స్ వచ్చాయి.
అయితే.. తాజాగా వీటిపై స్పందించిన డైరెక్టర్ శంకర్.. ‘‘భారతీయుడు-2’ చిత్రానికి నెగిటివ్ రివ్యూ (Negative Review)లు నేను అసలు ఊహించలేదు. కానీ పర్వాలేదు. ఇప్పుడు రానున్న ‘గేమ్ చేంజర్’ (Game Changer), ‘భారతీయుడు-3’ (Indian-3) తో బెస్ట్ వర్క్‌ను ప్రేక్షకులకు అందించబోతున్నాను. ఆడియన్స్ కచ్చితంగా ఎంటర్‌టైన్ అవుతారు. ‘గేమ్ చేంజర్’ సినిమా విషయంలో నేను ఫుల్ కాన్ఫిడెంట్ (confident)గా ఉన్నాను. మూవీ అద్భుతంగా వచ్చింది. రామ్ చరణ్ కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే పాత్ర ఇది. ఆయన లుక్, స్టైల్, యాక్షన్, డైలాగ్స్, డ్యాన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతారు’ అని తెలుపుతూ.. ‘భారతీయుడు-3’ (Indian-3) చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తానని ప్రకటించారు శంకర్. కాగా.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 10న రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు చిత్ర బృందం.