- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BCCI Net Worth : బీసీసీఐ నెట్‌వర్త్@ రూ.20వేల 686 కోట్లు
దిశ, స్పోర్ట్స్ : ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ బోర్డుగా పేరు గాంచిన బీసీసీఐ 2024 సంవత్సరంలో రూ.4200 కోట్లు ఆర్జించింది. తద్వారా మరింత ధనిక బోర్డుగా అవతరించింది. పీటీఐ వార్తా సంస్థ ఈ మేరకు గురువారం వివరాలను వెల్లడించింది. 2023 నాటికి బీసీసీఐ రూ.16 వేల 493 కోట్ల ఆస్తిని కలిగి ఉంది. 2024లో రూ.4,200 కోట్లు సంపాదించడంతో ఈ మొత్తం రూ.20వేల686 కోట్లకు చేరింది.
9 బోర్డుల మొత్తం ఆదాయం ఒకే ఇయర్‌లో దాటేసి..
బీసీసీఐ తర్వాత రిచెస్ట్ క్రికెట్ బోర్డుల జాబితాలో రెండో స్థానంలో ఉన్న క్రికెట్ ఆస్ట్రేలియా రూ.658 కోట్ల నెట్ వర్త్ కలిగి ఉంది. రూ.492 కోట్లతో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తర్వాతి స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రూ.458 కోట్లతో జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఈ మూడు క్రికెట్ బోర్డుల మొత్తం ఆదాయం రూ.1608 కోట్లుగా ఉంది. టాప్ 10లో భారత్‌ను మినహాయించి మిగతా జట్ల మొత్తం ఆదాయం రూ.3108 కోట్లుగా ఉంది. అయితే బీసీసీఐ ఒకే ఏడాదిలో రూ.4200 కోట్లు సంపాదించింది. తొమ్మిది జట్ల మొత్తం ఆదాయం బీసీసీఐ ఒకే ఏడాదిలో సంపాదించిన దాని కన్నా రూ.వెయ్యి కోట్లు తక్కువగానే ఉంది.