- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ గ్రామాల మహిళలకు అందని ద్రాక్షలా ఆర్టీసీ బస్సు ప్రయాణం...?
దిశ,కన్నెపల్లి : రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సేవలు అందుతుంటే వేమనపల్లి మండలంలోని పలు గ్రామాల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందని ద్రాక్షలా మారింది. కన్నెపల్లి మండల కేంద్రం నుండి చెన్నూరు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రైవేటు వాహనాల ద్వారానే ప్రయాణం చేయాల్సిన దుస్థితి. ప్రభుత్వాలు, పాలకులు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించేందుకు రోడ్ల నిర్మాణం, ఆర్టీసీ బస్సుల సదుపాయాన్ని కల్పిస్తుంటే ఆ గ్రామాలకు మాత్రం నేటికీ ఆర్టీసీ బస్సు సేవలు అందకపోవడానికి అధికారుల, పాలకుల నిర్లక్ష్యమే కారణం వేమనపల్లి మండలంలోని మంగేన పల్లి, నాగారం, సూరారం, మామిడిపల్లి, లక్ష్మీపూర్, జిల్లెడ, జక్కేపల్లి, బుయ్యారం గ్రామాలకు ఆర్టీసీ బస్సు సేవలు గత కొన్ని సంవత్సరాలుగా అందడం లేదు గతంలో మంచిర్యాల నుండి రింగ్ బస్సు సదుపాయం ఉండేదని గత కొంతకాలంగా ఆర్టీసీ బస్సు సేవలను నిలిపివేసిందని ప్రజలు తెలిపారు.
ఒకే రింగ్ బస్సుతో 9 మండలాల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు
ఒకే రింగ్ బస్సు నడపడంతో 9 మండలాల ప్రజలకు ఆర్టీసీ సేవలు అందే సదుపాయం ఉన్నప్పటికీ అధికారులు మాత్రం దృష్టి సాధించడం లేదు. మంచిర్యాల జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ రింగ్ బస్సు ద్వారా జైపూర్, భీమారం, చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, మందమర్రి, మండలాల ప్రజలకు ఆర్టీసీ బస్సు సేవలు అందనున్నాయి ఈ బస్సు ద్వారా కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర ప్రజలకు కూడా రవాణా సౌకర్యం మెరుగుపడనుంది.
ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం అధిక చార్జీల వసూల్..
వేమనపల్లి నుండి నియోజకవర్గమైన బెల్లంపల్లి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సదుపాయం లేకపోవడంతో ప్రైవేటు వాహన దారులు ఇష్టానుసారంగా ప్రయాణికుల నుంచి అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. మండల కేంద్రం బెల్లంపల్లి కిరూ. 200 ఛార్జ్, వేమనపల్లి నుండి నాగారం 8 కిలోమీటర్ల కిలోమీటర్లు దూరం ఉన్నప్పటికీ ప్రైవేటు వాహనాలకు రూ.50, జిల్లెడ, బుయ్యారం గ్రామాలు 12 కిలోమీటర్ల దూరానికి రూ.100 మేర అధిక చార్జీలు ప్రైవేట్ వాహనదారులు ప్రజల నుంచి వసూలు చేస్తున్నారు. బెల్లంపల్లి కి ఆర్టిసి బస్సు సదుపాయం కల్పిస్తే ప్రజలకు అధిక చార్జీల మోత నుంచి ప్రజలకు విముక్తి కలిగే అవకాశం ఉంది
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలి..
మండల కేంద్రం నుండి నియోజకవర్గ బెల్లంపల్లి వైపు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు సేవలు అందే దిశగా అధికారులు, పాలకులు దృష్టి సారిస్తే మంచిర్యాల జిల్లా జిల్లా కేంద్రం నుండి ఒక ఆర్టీసీ రింగు బస్సు చెన్నూరు, వేమనపల్లి, కన్నెపల్లి, బెల్లంపల్లి మీదుగా మంచిర్యాల వరకు నడిపిస్తే 9 మండలాల ప్రయాణికులకు రవాణా సౌకర్యాలతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దక్కుతుంది. ఇప్పటికైనా అధికారులు, పాలకులు రవాణా సౌకర్యం అందించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.