- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap Speaker: స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: పెన్షన్ల(Pensions)పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు(Speaker Ayyannapatra) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తప్పుడు వయసుతో 3 లక్షల 20 వేల మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఐదేళ్లలో రూ. 7 వేల కోట్లు దొంగ పెన్షన్ల రూపంలో కొట్టేస్తున్నారని మండిపడ్డారు. అది చాలా అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ పెన్షన్లు తీసివేస్తే ఓట్లు వేయమని అంటున్నారని, తనకు ఓట్లు వేసినా వేయకపోయినా పర్వాలేదన్నారు. పెన్షన్ల విషయంలో తాను అంతే మాట్లాడతానని, ఎవరేమనుకున్నా పట్టించుకోనని, తన స్టైలే వేరన్నారని చెప్పారు. రూ.7 వేల కోట్లతో తాండవ రిజర్వాయర్లలాంటివి మూడు కట్టొచ్చన్నారు. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు చెబితే చూద్దాములే అన్నారని తెలిపారు. అలాగే యువత పాడైపోతుందని వ్యాఖ్యానించారు. గంజాయి, మద్యం ఎక్కువగా సేవిస్తున్నారని చెప్పారు. ఇదేంటని అడిగిన వారిని చితకబాదుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.