- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెండింగ్లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలి : ఎస్పీ గౌష్ ఆలం
దిశ,ఆదిలాబాద్ : జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ లో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పోలీస్ అధికారులకు సూచించారు.గురువారం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ నెలవారి నేర సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత సంవత్సరంలో కాలంలో పెండింగ్‌లో ఉన్న పూర్తి కేసులను విచారణ చేసి బాధితులకు న్యాయం చేసే విధంగా కోర్టులలో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.జిల్లాలో నేరాల అదుపుకు నూతన పోలీసు సిబ్బందిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ పెట్రోలింగ్, గస్తీ, రాత్రి సమయాలలో బీట్ పద్ధతిని ఉపయోగిస్తూ, బ్లూ కోర్ట్, డయల్ 100 సిబ్బందిని వినియోగిస్తూ,ఆర్థిక నేరాలను కట్టడి చేయాలని సూచించారు.
ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఎస్టీ, గంజాయి, పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్, మహిళలపై జరిగే నేరాలపై చర్చించి సూచనలు చేశారు. కోర్టు డ్యూటీ అధికారులతో ప్రతి శనివారం సమావేశాన్ని ఏర్పాటు చేసి కోర్టులలో జరిగే విచారణ పద్ధతిని,కేసుల ప్రస్తుత స్థితిగతులను పర్యవేక్షించాలని అన్నారు.ఈ నెలలో జిల్లాలో జరిగిన మూడు కేసులలో నేరస్తులకు జీవితకాల శిక్ష పడటం లో కీలక పాత్ర పోషించిన పిపిలు సంజయ్ వైరా గ్రే, మేకల మధుకర్ లను జిల్లా ఎస్పీ శాలువాతో సత్కరించి,అభినందించారు.అదేవిధంగా సీఈఐ ఆర్ ద్వారా జిల్లా వ్యాప్తంగా పలు సందర్భాల్లో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు 28 మొబైల్ ఫోన్ లను తిరిగి వారికి అందజేశారు. ఈ సమీక్షలో డీఎస్పీలు పోతారం శ్రీనివాస్,ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేంద్ర, సిఐలు,రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు,తదితరులు పాల్గొన్నారు.