- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరతో విబేధాల్లేవు : ఎమ్మెల్యే కడియం
దిశ, వరంగల్ బ్యూరో : రానున్న 18నెలలో స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన స్టేషన్ ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… 30 ఏళ్లుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు నన్ను సొంత బిడ్డలా అక్కున చేర్చుకొని ఆశీర్వదిస్తున్నారని, వారి రుణం తీర్చుకోలేనిదని అన్నారు. 15 ఏళ్ల తర్వాత నా పై నమ్మకంతో మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారాని కాబట్టి వారి నమ్మకం నిలబెట్టుకునే విధంగా పని చేస్తానని తెలిపారు. సింగపురం ఇందిరా గారికి నాకు ఎలాంటి అభిప్రాయబేధాలు గాని, విబేధాలు గాని లేవని తెలిపారు.
రాజకీయంగా నేను చేయని పదవులు లేవని, ఇంకా నాకు ఏ పదవులు అవసరం లేదని, నాకు ఎవరితో పోటీ లేదని తేల్చి చెప్పారు. విభేదాలు సృష్టించి పని చేయాల్సిన అవసరం నాకు లేదని, నా నియోజకవర్గ ప్రజలకు పని చేయడమే నా కర్తవ్యమని స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీలో గాని, నియోజకవర్గంలో గాని కొత్త పాత అనే తేడాలు ఉండవని, అందరం కలిసి ఒక కుటుంబంలా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రతీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే మన లక్ష్యం అని అన్నారు.
ఈ సంక్రాతిలోగ స్టేషన్ ఘనపూర్ గ్రామాన్ని ముఖ్యమంత్రితో మున్సిపాలిటీగా ప్రకటన చేయిస్తానని దానితో పాటే మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 25కోట్ల నిధులు కూడా సీఎంతో మంజూరు చేపించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు. అదే విధంగా మున్సిపాలిటీ కేంద్రంలో 500 మంది కూర్చునే విధంగా మున్సిపాలిటీ టౌన్ హల్ నిర్మించనున్నట్లు తెలిపారు. 26కోట్లతో ఇంటిగ్రేటెడ్ డివిజనల్ ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి, 100 పడకల అస్పత్రి భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో 100 పడకల అస్పత్రి నిర్మాణానికి 4 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని కేటాయించారాని దీనికి సీఎం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
30కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయబోతున్నట్లు అలాగే నియోజకవర్గ కేంద్రంలో ఇప్పటి వరకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లేదని, కావున ప్లై ఓవర్ పక్కన ఉన్న రెండు ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేసుకోబోతునట్లు వెల్లడించారు. నియోజకవర్గ కేంద్రంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు, యువతకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక వసతులతో లైబ్రరీ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోనే అత్యధికంగా స్టేషన్ ఘనపూర్ గ్రామానికి 250 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు అందే విధంగా ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు చూడాలని కోరారు. ఒక్క ఏడాదిలోనే నియోజకవర్గ అభివృద్ధికి రూ. 750కోట్ల నిధులు తెచ్చుకున్నామని, రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలేదని స్పష్టం చేశారు.
రానున్న 18 నెలల్లో అంటే 2026 మే వరకు స్టేషన్ ఘనపూర్ రూపు రేఖలు మార్చేస్తానని నియోజకవర్గ ప్రజలకు మాట ఇచ్చారు. కడియం శ్రీహరి మాట తప్పే వాడు కాదని, మాట ఇచ్చాను అంటే ఖచ్చితంగా మాట నిలబెట్టుకుంటాని హామీ ఇచ్చారు. నేను అయ్యే పనిని అవుతుంది అని, కానీ పనిని కాదు అని ఖచ్చితంగా మాట్లాడుతానని అది నా స్వభావం అని తెలిపారు. కానీ అలా చెప్పడం అందరికీ నచ్చదని అన్నారు. నా పరిధిలో ఉండి న్యాయబద్ధమైన పని అయితే తప్పకుండా చేస్తానని తెలిపారు. నా వద్దకు రావడానికి ఎవరూ సంకొంచించాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో మహిళా సంఘాలకు పెద్ద పీట వేసానని, ప్రతీ మహిళను బిడ్డలా, తల్లిలా మాత్రమే భావించానని అన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది అని చెప్పుకునే విధంగానే పని చేస్తానని వెల్లడించారు. కార్యక్రమంలో స్టేషన్ ఘనపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రస్తుత, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.