- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాట స్థావరాలపై దాడి.. ముగ్గురి అరెస్ట్..
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గల వారి పేట గ్రామ శివారులో చెట్ల పొదలలో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరం పై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు రెడ్ హ్యాండెడ్ గా దొరకగా ఐదుగురు పరారయ్యారు. ఘటనా స్థలంలో రూ.7,650/-నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ సీఐ రాజ్ కుమార్, టాస్క్ ఫోర్స్ ఎస్సై లచ్చన్న టాస్క్ ఫోర్స్ సిబ్బంది కలిసి, వారి పేట శివారులోని చెట్ల పొదలలో పేకాట స్థావరంపై దాడి చేశారు. పక్కా సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఆకస్మికంగా దాడి చేయగా సోమగూడెం చెందిన కనుకుల తిరుపతి, బువ్వ గూడెం చెందిన నవనందుల వెంకటేష్, తంగళ్ళపల్లి చెందిన అక్కనపల్లి లక్ష్మి పతి పట్టుబడ్డారు. పోలీసుల రాకను గమనించిన గుండ్ల సంతోష్, పత్తిపాక ప్రవీణ్, ఎదుల తిరుపతి, గుండా రాజేందర్,సాయి అయ్యారు. విచారణ నిమిత్తం అరెస్ట్ అయిన నిందితులను కాసిపేట పోలీసులకు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తెలిపారు.