- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది
దిశ, నకిరేకల్ : ధర్మారెడ్డి పిల్లాయి పల్లి కాలువలు నకిరేకల్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కల అని ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ధర్మారెడ్డి కాల్వకు 129 కోట్లు పిల్లాయిపల్లి కల్వకు 95 కోట్లు నిధులు మంజూరు చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలో గురువారం మాట్లాడుతూ..ఈ రెండు కాలువల కోసం ప్రాంత ప్రజలు వెయ్యి కనులతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఈ కాలువల గురించి నిత్యం మాట్లాడిన ఒడువని ముచ్చటల మిగిలిపోయిందన్నారు. మూసీ ఆయకట్టు కింద ఉన్న కాలువలను పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన కాలువలను పూర్తిచేసే బాధ్యత మాదని చెప్పడం అభినందించే విషయం అన్నారు. మంత్రులు స్వయంగా భువనగిరికి వచ్చి మూడుసార్లు రివ్యూ చేశారని వెల్లడించారు. ఈరోజు నిధులు ఇచ్చి జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ రెండు కాలువల ద్వారా నియోజకవర్గంలో 25 వరకు చెరువులు నింపి..ఒక చరిత్రను తిరగరాస్తామన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుకు 35 కోట్లు నిధులు విడుదల చేశారని, లెఫ్ట్ రైట్ కెనాలకు ఇంకా 70 కోట్లు నిధులు కావాలని కోరారు.