Sarangapani Jatakam: డేట్ మారినా ఎంటర్‌టైన్మెంట్ తగ్గదు.. రిలీజ్ వాయిదాపై కూడా హైప్ పెంచేస్తున్న టీమ్

by sudharani |
Sarangapani Jatakam: డేట్ మారినా ఎంటర్‌టైన్మెంట్ తగ్గదు.. రిలీజ్ వాయిదాపై కూడా హైప్ పెంచేస్తున్న టీమ్
X

దిశ, సినిమా: యంగ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi) ‘బలగం’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ‘ఓం భీమ్ బుష్, డార్లింగ్, 35 చిన్న కథ కాదు’ వంటి మూవీస్‌తో అలరించిన ప్రియదర్శి.. ఇప్పుడు మరో కొత్త కాన్సెప్ట్ (New Concept)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇంద్రగంటి మోహన కృష్ణ (Indraganti Mohana Krishna) దర్శకత్వం వహిస్తున్న ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jatakam)లో ప్రియదర్శి ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు.

రూపా కొడువయూర్ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్ వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం డిసెంబర్ 20 న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ పోన్ అయినట్లు ప్రకటించారు చిత్ర బృందం. ‘అత్యుత్తమ అనుభవాన్ని మీకు అందించడం కోసం.. మరింతగా వినోదాన్ని పంచడం కోసం కాస్త ఆలస్యంగా సినిమాను తీసుకురావాలని భావిస్తున్నం. డేట్ మారినా ఎంటర్‌టైన్‌మెంట్‌ తగ్గదు.. కచ్చితంగా అంతకు మించి వినోదం మీకు అందిస్తాము’ అని చెప్పుకొచ్చారు మేకర్స్. అంతే కాకుండా త్వరలోనే కొత్త విడుదల తేదీ అనౌన్స్ చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed