- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏజెన్సీ ప్రాంతంలో వైద్యుడిగా ఎనలేని సేవలు చేసిన వ్యక్తి
దిశ, గూడూరు: వైద్యుడిగా ఏజెన్సీ ప్రాంతంలో ఎంతోమంది రోగులకు వైద్య సేవలు అందించి అక్కడి ప్రజలకు ఎనలేని సేవలు అందించిన విశ్రాంత వైద్యులు డాక్టర్ భీమగాని లక్ష్మీ నారాయణ గౌడ్ గుండెపోటుతో మృతి చెందడం చాలా బాధాకరమని ఉమ్మడి జిల్లా లోని వైద్యులు సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడూరు మండలం అయోధ్య పురం గ్రామంలో గురువారం సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వైద్యులు వారి బంధువులు మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో భాగంగా అందరితో ఆత్మీయంగా పలకరించే వ్యక్తి అని అలాంటి ఒక మంచి వైద్యుని కోల్పోవడం చాలా దురదృష్టకరమని అన్నారు.
గూడూరులో మొదటగా ఆసుపత్రిని ప్రారంభించినప్పుడు ఎంతోమంది పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించారని, అలాగే వారు ప్రభుత్వ వైద్యుడిగా మొదటగా ఏజెన్సీ ప్రాంతంలోనే కొత్తగూడ మండలంలో పనిచేసి అక్కడ నుండి గూడూరు, ఖమ్మం వరంగల్ జిల్లాలలో జిల్లా స్థాయి వైద్య అధికారిగా పనిచేసి ఎన్నోసార్లు ఉత్తమ వైద్యాధికారిగా అవార్డులు కూడా అందుకున్నారని వైద్య వృత్తిలో వారి సేవలు అమోఘం అని కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ, డాక్టర్ కంటేం రవికిరణ్, భరత్ రెడ్డి, సందీప్ , విజయ్ ,లక్ష్మణ్ , రమేష్ , నర్సంపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు పాల్గొన్నారు.