అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది : కంటోన్మెంట్ ఎమ్మెల్యే

by Aamani |
అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది : కంటోన్మెంట్ ఎమ్మెల్యే
X

దిశ,తిరుమలగిరి : మోండా మార్కెట్ లో అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం సందర్శించారు.బాదితులను ప్రమాద వివరాలు తెలుసుకున్న ఆయన బాధితులకు అండగా ఉంటానని,ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని బాధితులకు హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు చలిమంటలు పెట్టుకోవడంతో అందులో నుంచి నిప్పురవ్వలు పడి మంటలు ఏర్పడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారని అన్నారు.

ఈ ప్రాంతంలో రాత్రివేళల్లో కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని అలాంటి వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.వీధి దీపాలు,సీసీ కెమెరాలు లేవని,అదేవిధంగా అంతర్గత రోడ్లు కూడా సరిగా లేవని స్థానికులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట దుకాణాలు కాలిపోయిన బాధితులు,ఇతర స్థానిక దుకాణదారులు,పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed