నల్గొండ టూ టౌన్ సీఐ మల్టీ జోన్-2 కు ఎటాచ్..కారణం ఇదే..

by Naveena |
నల్గొండ టూ టౌన్ సీఐ మల్టీ జోన్-2 కు ఎటాచ్..కారణం ఇదే..
X

దిశ, నల్లగొండ క్రైం: ఓ మహిళతో వివాహేతర సంబంధం ఆరోపణలు ఎదుర్కుంటున్న నల్లగొండ టూటౌన్ సీఐ డానియేల్ కుమార్ ను వీఆర్ కు ఎటాచ్ చేస్తూ ఐజీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 9న తన భార్యతో సీఐ వివాహేతర సంబంధం పెట్టుకున్నారని, దీంతో ఆమె కాపురానికి రావడం లేదని ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎస్పీ శరత్ చంద్ర పవార్ కు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్పీ ఆదేశాలతో విచారణ జరిపించి నివేదికను మల్టీ జోన్-2 ఉన్నతాధికారులకు సమర్పించారు. దీంతో వారు పరిశీలించిన అనంతరం, సీఐని మల్టీజోన్-2 హైదరాబాద్ కు ఎటాచ్ చేశారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ప్రజల పట్ల గౌరవంగా మెలిగి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు.నల్గొండ టూ టౌన్ సీఐ మల్టీ జోన్-2 కు ఎటాచ్

Advertisement

Next Story