- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఫార్ములా-ఈ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిశారు.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ కార్ రేసు(Formula-E Car Race)ను హైదరాబాద్ తెచ్చేందుకు గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయి.. FIA కింద ఫార్ములా రేసులు జరుగుతాయి.. చంద్రబాబు(Chandrababu) హైదరాబాద్‌లో ఫార్ములా రేసు కోసం ప్రయత్నించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) స్పష్టం చేశారు. గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. FMSCI, FIA అని రెండు సంస్థలు ఈ రేసులు నిర్వహిస్తాయి. గతంలో గోపన్‌పల్లిలో ఎఫ్-1 రేసు ట్రాక్ కోసం 580 ఎకరాల భూసేకరణ చేశారని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అక్కడ రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కూడా ల్యాండ్ ఉందని అన్నారు. రేస్ అనేది నాలుగు సంవత్సరాలు జరుగుతుందని తెలిపారు. ఎఫ్-1 రేస్‌పై నగరాల అభివృద్ధి ఆధారపడి ఉందని వెల్లడించారు. రేసింగ్‌లో ఎలక్ట్రిక్ వెహికిల్స్ రాకతో మరింత పాపులారిటీ వచ్చిందని తెలిపారు. 14 కీలక రంగాల్లో ఆటోమొబైల్ రంగాన్ని గుర్తించినట్లు తెలిపారు.
ఈవీ పాలసీ తీసుకురావాలని తమ ప్రభుత్వంలో అనుకున్నామని చెప్పారు. చంద్రబాబు పెట్టిన అప్పటి జీనోమ్ వ్యాలీ ఇప్పుడు పెద్ద వృక్షమైందని గుర్తుచేశారు. మొక్క ఒకరు నాటుతారు.. ఫలాలు భావితరాల వాళ్లు పొందుతారని అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కుంభకోణంపై ఏదో కనిపెట్టామని లీకులు ఇస్తున్నారు. అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్‌ను అడిగాం. చర్చ చేయాలని సీఎం రేవంత్‌కు కూడా లేఖ రాశాం. దీనిపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి లేదని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. జరిగింది తప్పు అని ధైర్యంగా నిరూపించగలరా? అని కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ ప్రశ్నించారు. అసలు జరిగిందేమిటో తెలంగాణ ప్రజలకు తెలియాలని.. కళ్లలో కళ్లు పెట్టి చూసి మాట్లాదే ధైర్యం కాంగ్రెస్ నేతల్లో ఎవరికీ లేదని ఎద్దేవా చేశారు.
25 అక్టోబర్ 2022లో మొదటి అగ్రిమెంట్ జరిగిందని అన్నారు. రేస్ జరగాలంటే కొంత ఖర్చు అవుతుంది. అందుకే ఇతర కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు. రేస్‌కు కేంద్రం సహకారం ఉందని కిషన్ రెడ్డి క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రేస్‌కు ఎంతో మంది ప్రముఖులు వచ్చారని గుర్తుచేశారు. ఈ రేస్‌కు ఖర్చు మొత్తం HMDA పెట్టిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో జరిగే ఏ కార్యక్రమం అయినా HMDA దగ్గరుండి చూసుకుంటుందని తెలిపారు. HMDA నుంచి రూ.35 కోట్ల వరకు ఖర్చు చేశామని అన్నారు. మొత్తం ఎఫ్-1 రేస్‌కు రూ.150 కోట్లు ఖర్చు చేస్తే.. రూ.700 కోట్ల లాభం వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఆ రేస్‌తో ప్రపంచ దృష్టిని ఆకర్షించామని అన్నారు. ఎలన్‌మస్క్‌ను కూడా తీసుకురావాలని ప్రయత్నం చేసినట్లు తెలిపారు.
తెలంగాణ రేస్ జరగాలంటే డబ్బు కట్టాలని 3వ తేదీ ఆగష్టు 2023లో తమకు మెయిల్ వచ్చందని కేటీఆర్ అన్నారు. ఫార్ములా-ఈ చీఫ్ రేంత్ రెడ్డిని కూడా కలిశారు. రేస్ నిర్వహణ పట్ల రేవంత్ పాజిటివ్‌గా స్పందించారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచిపెట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. అంతేకాదు.. ఆ మీటింగ్‌లో దాన కిషోర్ కూడా ఉన్నారని అన్నారు. వచ్చే మూడేళ్లు కూడా హైదరాబాద్‌లో రేస్ నిర్వహిస్తామని ఫార్ములా-ఈచీఫ్ ప్రభుత్వానికి చెప్పారని అన్నారు. తర్వాత డబ్బులు కట్టలేదని రద్దు చేశారని తెలిపారు. ఇందులో అవినీతి ఎక్కడుందో తెలియడం లేదని అన్నారు. బట్టకాల్చి మీదేసే ప్రయత్నంలో భాగంగానే తనపై ఏసీబీ కేసు పెట్టారని తెలిపారు. నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేయాలి. రేస్‌ను హైదరాబాద్, ఇండియాకు కాకుండా చేసి బద్నాం చేశారని కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
లగచర్ల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్ కొనియాడారు. లగచర్ల రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి విరోచితంగా పోరాటం చేశారని అన్నారు. ఎప్పుడైనా చివరకు ధర్మమే గెలుస్తుందని.. పట్నం నరేందర్ రెడ్డి విడుదల కావడంతో అది మరోసారి నిరూపితం అయిందని అన్నారు. ఇది కొడంగల్ ప్రజల విజయమని తెలిపారు.