- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రీడా ప్రాంగణానికి దారేది...?
దిశ, కన్నెపల్లి: యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించేందుకు లక్షల రూపాయలు ఖర్చుపెట్టి ప్రభుత్వం క్రీడా ప్రాంగణాలను నిర్మించింది. కన్నెపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణానికి వెళ్లే ప్రధాన ద్వారాన్ని సిమెంట్ స్తంభాలతో ఫెన్సింగ్ ద్వారా కంచె వేసి మూసి వేశారు. క్రీడా ప్రాంగణం వద్ద వ్యాయామం చేసుకునేందుకు వ్యాయామ పరికరాలను ఆటలు ఆడుకునేందుకు స్థలాన్ని చదును చేసి క్రీడా ప్రాంగణం అని గుర్తించే విధంగా ప్రధాన ద్వారం వద్ద పెద్ద పెద్ద ప్రాంగణం బోర్డులను ఏర్పాటు చేశారు. గత కొంతకాలంగా ప్రధాన ముఖద్వారం వద్ద అడ్డంగా కంచె వేయడంతో క్రీడా ప్రాంగణానికి వెళ్లే దారి లేకపోవడంతో క్రీడలు ఆడుకోవడానికి యువత విద్యార్థులకు రావడం లేదు.
మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణానికి యువత కానీ విద్యార్థులు గాని వచ్చి ఎలాంటి ఆటలు ఆడకుండా చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలలు వాటికి ప్రహరీ గోడలు, వివిధ మండల కార్యాలయాలు ఉన్నాయి. ఎంపీడీవో కార్యాలయం పక్కనే క్రీడా ప్రాంగణం ఉన్నప్పటికీ అధికారులు నిత్యం కార్యాలయానికి వచ్చి పోతున్నారు. తప్ప క్రీడా ప్రాంగణానికి అడ్డుగా ఉన్న కంచెను గమనించకపోవడం గమనార్హం ఇప్పటికైనా సంబంధిత శాఖల అధికారులు స్పందించి క్రీడా ప్రాంగణానికి వేసిన కంచెను తొలగించి రహదారి ని ఏర్పాటు చేయాలని యువత కోరుకుంటున్నారు.