ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: నటి జత్వానీ కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2024-12-19 10:59:57.0  )
ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు: నటి జత్వానీ కేసులో హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి జత్వానీ(Mumbai actress Jatwani)ని గత ప్రభుత్వంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులతో పాటు న్యాయవాది, ఏసీబీ, సీఐ వేధించిన విషయం తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ కేసు విచారణ హైకోర్టులో సాగుతుంది. ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌( Kukkala Vidyasagar)ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. కానీ A2 నిందితుడు సీతారామాంజనేయులను మాత్రం అరెస్ట్ చేయలేదు. ఇదే విషయాన్ని మిగిలిన నిందితులు ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఏపీ హైకోర్టు జడ్జి(AP High Court Judge) ప్రస్తావించారు.

ఇద్దరు ఐపీఎస్‌లు కాంతిరాణా, విశాల్ గున్నీ, న్యాయవాది, ఏసీపీ, సీఐ తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా జడ్జి సంచలన ప్రశ్నలు సంధించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏ2 మాజీ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయుల(Former IPS officer Sitharamanjaneula)ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేయలేదు కదా అని నిలదీశారు. అనంతరం విచారణను కంటిన్యూ చేశారు.

Advertisement

Next Story

Most Viewed