రాష్ట్రంలో సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-19 11:05:10.0  )
రాష్ట్రంలో సంచలనం.. కేటీఆర్‌పై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ(Telangana) రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌(KTR)పై కేసు నమోదు అయింది. ఫార్ములా-ఈ కార్ రేసు(Formula-E car race)లో జరిగిన అవకతవలపై ఏసీబీ(ACB) అధికారులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ పేర్కొంది. నాలుగు నాన్‌బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది. కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌(Arvind Kumar), ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి(BLN Reddy)పైన కూడా కేసులు నమోదు చేసింది.

ఏ1గా కేటీఆర్, ఏ2గా అరవింద్ కుమార్, ఏ3గా బీఎల్‌ఎన్ రెడ్డిని పేర్కొన్నది. మరోవైపు.. ఫార్ములా-ఈ కార్ రేసు అంశంలో మాజీ మంత్రి కేటీఆర్‌ పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే. అవినీతి నిరోధక చట్టం ప్రకారం గవర్నర్ అనుమతి లేఖను కూడా పంపించారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో రిజర్వ్ బ్యాంకు అనుమతి లేకుండా విదేశీ సంస్థకు ఏకపక్షంగా నిధుల బదిలీ జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. దీంతో విచారణ చేసి.. ఆ వివరాల ఆధారంగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed