- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘గల్ప్ బోర్డు సంక్షేమ బోర్డు అమలు చేయాలి’
దిశ,జన్నారం : గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న వలసదారుల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిఅమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని గల్ప్ సంక్షేమ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్లెడ భూమన్న అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల చిరకాల వాంఛ గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయడంలో విఫలమైందని ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం 216 జీఓ విడుదల చేసి డిసెంబర్ 2023 తర్వాత గల్ఫ్ లో చనిపోయిన కొందరు గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేసినప్పటికి పూర్తిగా న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు.
తెలంగాణ వలసదారుల కష్టాలను గుర్తించి పక్క రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలు ఇక్కడ కూడా తీసుకురావాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంచార్జ్ ఎరుకల రాజు గౌడ్, రాష్ట్ర కోశాధికారి అమర కొండ మల్లేష్, దుబాయ్ శాఖ అధ్యక్షుడు మహమ్మద్ అలీమ్, బార్ దుబాయ్ కోఆర్డినేటర్ కూనారపు రమేష్, ధర్మాజీ సత్తెన సురేష్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.