ఆ రెండు పార్టీలకు అనుకూలమనే ప్రచారం.. ఎన్నికల వేళ BRSలో కొత్త టెన్షన్..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-04 07:28:36.0  )
ఆ రెండు పార్టీలకు అనుకూలమనే ప్రచారం.. ఎన్నికల వేళ BRSలో కొత్త టెన్షన్..!
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీలో కొత్త టెన్షన్ మొదలైంది. జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయాలు కారు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీష్ కుమార్ అధ్యక్షతన పాట్నాలో జరిగిన మీటింగ్‌కు కాంగ్రెస్ సహా 19 పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. అయితే బీజేపీపై ఒంటి కాలిపై లేచిన సీఎం కేసీఆర్ ఈ కీలక భేటీకి దూరంగా ఉండటంతో బీజేపీకి అనుకూలమనే ప్రచారం సాగింది.

మరో వైపు అఖిలేష్ యాదవ్‌‌తో సీఎం కేసీఆర్ నిన్న భేటీ కావడంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ యేతర కూటమి కోసం ప్రయత్నాలు సాగించిన కేసీఆర్‌కు కూటమికి దూరంగా ఉంటే బీజేపీకి అనుకూలమని, ఒక వేళ కూటమిలో చేరితే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని బీఆర్ఎస్ పార్టీలో ఆందోళన మొదలైంది.

కేసీఆర్ వ్యహహార శైలిపై డౌట్.. కాంగ్రెస్ అలర్ట్

అసెంబ్లీ ఎన్నికల వేళ కూటమి రాజకీయం కారు పార్టీకి ఇబ్బందికరంగా మారింది. 20 ప్రతిపక్ష పార్టీలు ఒక వైపు తానో వైపు ఉండి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం అసాధ్యమని పొలిటికల్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అయితే ప్రజెంట్ కేసీఆర్ సైతం నేషనల్ వైడ్ కాకుండా మహారాష్ట్ర పైనే ఫోకస్ పెట్టారు. అక్కడ కొన్ని గ్రామాలు తెలంగాణలో వీలినం చేయాలని పట్టుబెట్టిన సంగతిని దృష్టిలో ఉంచుకునే కేసీఆర్ ప్రజెంట్ ఓన్లీ మహారాష్ట్రపైనే ఫోకస్ పెట్టినట్లు తెలిసింది.

తెలంగాణ ఆకాంక్ష నేరవేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో నాటి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ యోచించారు. అయితే అనూహ్యంగా విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని హస్తం పార్టీకి షాక్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో వీక్ చేస్తూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్‌ను అంత ఈజీగా నమ్మడం లేదని తెలుస్తోంది. ఇటీవల ఖమ్మం బహిరంగ సభలో సైతం రాహుల్ గాంధీ బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ బీజేపీ-బీ టీం అని కామెంట్ చేశారు. ధరణి, కాళేశ్వరంలో అంతా అవినీతి అంటూ నేరుగా కేసీఆర్‌ను రాహుల్ టార్గెట్ చేశారు. తద్వారా బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే ఒక్కటే అనే సంకేతాన్ని ఇచ్చారు. ఎమ్మెల్సీ కవిత వ్యహహారం క్లైమాక్స్‌కు చేరిన నేపథ్యంలో బీజేపీని టార్గెట్ చేయడం ఆపేసిన కేసీఆర్ తరచూ కాంగ్రెస్‌పైనే విమర్శలు చేస్తున్నారు.

రెండు పార్టీలకు హైప్ క్రియేట్ చేసి లబ్ధి పొందే స్కెచ్!

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ కాంగ్రెస్‌ను బలహీనపరిచారు. 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో ఓటర్లు ప్రత్యామ్నాయం బీజేపీయే అని భావిస్తూ వస్తున్నారు. అయితే క్రమంగా బీజేపీ బలపడుతుందని గ్రహించి మళ్లీ కాంగ్రెస్‌కు హైప్ క్రియేట్ చేస్తున్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజల మూడ్ చేంజ్ చేసి ఈ సారి ఎలాగైనా గట్టేక్కాలని గులాబీ బాస్ ప్లాన్ చేశారు.

అందులో భాగంగానే రెండు పార్టీలకు ఓట్లు పడి చీలిపోతే అంతిమంగా లబ్ధి పొందేది బీఆర్ఎస్ అని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రజలను డైలామాలో పడేసి బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయమే తెలంగాణలో లేదు.. అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వాలని బీఆర్ఎస్ చీఫ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మెజార్టీ ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా ఈ సారి కేసీఆర్ ఈ ప్లాన్ వేసినట్లు తెలిసింది.

కాంగ్రెస్ కర్ణాటక మంత్రతో గులాబీ పార్టీలో ఆందోళన

కర్ణాటకలో ఓటర్లను మేనిఫెస్టోతో ఆకర్షించిన కాంగ్రెస్ తెలంగాణలో ఇప్పటికే రూ.2లక్షల రుణమాఫీని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. పథకాలతోనే సీఎం కేసీఆర్‌ను ఓడించగలమని హస్తం పార్టీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే ఎన్నికలను ప్రభావితం చేసే రైతులు, ఇతర వర్గాలకు వరాల జల్లు కురిపించేలా స్కెచ్ వేస్తున్నారు ఖమ్మం సభలో చేయూత పథకంగా ద్వారా వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, కల్లు గీత కార్మికుల ఓట్లే లక్ష్యంగా రూ.4 వేల పింఛన్ ఇస్తామని అనౌన్స్ చేసింది.

దీంతో ఎన్నికల నాటికి కాంగ్రెస్ ఇంకా ఏయే పథకాలను ప్రకటిస్తుంది. మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది అనే అంశాలపై సీఎం కేసీఆర్ ఫోకస్ పెట్టారు. హస్తం పార్టీలో ఉన్న కొంత మంది కోవర్టులతో కాంగ్రెస్ పార్టీ వ్యూహాలపై ఎప్పటికప్పుడు గులాబీ బాస్ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ మేనిఫెస్టో వెలువడే దాకా వేచి చూసే ధోరణి అవలంబించి తర్వాత కౌంటర్ మేనిఫెస్టో తయారు చేయాలని గులాబీ బాస్ నిర్ణయించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రంలో దూకుడు పెంచింది. గతంలో కేసీఆర్ ఇచ్చిన ఝలక్ ల దృష్ట్యా ఈ సారి గట్టి షాక్ ఇచ్చేందుకు ఉన్న అవకాశాలను వాడుకోవాలని ఫిక్స్ అయింది. నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్‌లో చేరి అసంతృప్తులుగా ఉన్న నాయకుల చేరికపై ఫోకస్ పెట్టింది. మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ తెలంగాణలో ఏ మేరకు ప్రభావం చూపనుంది అనేది మరి కొన్ని రోజుల్లో తేలిపోనుంది.

Read More: ఆ 50 నియోజకవర్గాలపై KCR స్పెషల్ ఫోకస్.. ప్రజల మైండ్ డైవర్ట్ కాకుండా కొత్త వ్యూహాం..!

Advertisement

Next Story

Most Viewed