- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కవిత, చంద్రబాబు ఇష్యూలపై పార్టీ నేతలకు బీజేపీ హైకమాండ్ కీలక ఆదేశం
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ రాజకీయ వేడి పెరుగుతోంది. ఈ పొలిటికల్ హీట్‌కు తోడు కవిత లిక్కర్ కేసు మళ్లీ తెరపైకి రావడం, చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టు కావడం రాజకీయ దుమారం రేపుతున్నాయి. ఇన్ని రోజులు కదలిక లేకుండా పోయిన లిక్కర్ కేసు పలువురు అప్రూవర్ గా మారడంతో తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈడీ కవితకు సమన్లు సైతం జారీ చేసింది. ఈ అంశాలపై ఎవరూ నోరు మెదపకూడదని బీజేపీ జాతీయ నాయకత్వం రాష్ట్ర నేతలకు సంకేతాలు పంపించింది. గతంలో కవితను జైల్లో పెడతాం.. అరెస్టు చేస్తామనే కామెంట్లు పార్టీని ఇరకాటంలో పెట్టాయి. అందుకే ఆ విషయంలో పార్టీ ఆచితూచి వ్యవహరించాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసింది.
అయితే గతంలోలాగా కాకుండా ఈసారి కవిత కేసులో వ్యాఖ్యలు చేయొద్దని బీజేపీ హైకమాండ్ భావిస్తోంది. అందుకే ముందస్తుగానే నేతలకు సంకేతాలను పంపించింది. ఇతర పార్టీల నుంచి ఇటీవల కాషాయ తీర్థం పుచ్చుకున్న పలువురు నేతలను జాతీయ నాయకత్వం అలర్ట్ చేసింది. కేసీఆర్ ను గద్దె దించాలని వచ్చిన ప్రతినేత కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిదని పలు సూచనలు చేసినట్లు తెలిసింది. మీడియా ముందు ఈ కేసు విషయంలో ఓపెన్ కావొద్దని దిశానిర్దేశం చేసింది. కొద్ది రోజులుగా కవిత లిక్కర్ కేసుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అనే ముద్ర పడింది. ఇప్పుడా మరకను తొలగించుకోవాలని బీజేపీ భావిస్తోంది.
ఇకపోతే చంద్రబాబు అవినీతి కేసు విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని ముఖ్య నేతలకు బీజేపీ హైకమాండ్ మెసేజులు సైతం పంపించినట్లు తెలిసింది. అవినీతి కేసు కాబట్టి దానిపై పాజిటివ్ గా వ్యాఖ్యానిస్తే పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడే అవకాశముందని హైకమాండ్ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు నేతలు చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. పలువురు ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పిలిచి మాట్లాడి ఉండాల్సిందని, ప్రభుత్వం సంయమనం పాటించాల్సిందని, కక్ష సాధింపు చర్యలు సరికాదని వ్యాఖ్యానించారు. కొందరు నేతలు మీడియా ప్రతినిధుల ప్రశ్నలపై మొహమాటంగా అరెస్టు విధానంపై మాత్రమే సమాధానాలు చెబుతున్నారు.. కానీ అవినీతి కేసుపై మాత్రం సమర్థిస్తూ ఎక్కడా ఓపెన్ కాలేదు. కాగా, చంద్రబాబు అరెస్టుపై అక్కడి దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయని, ఇతర నేతలెవరూ స్పందించొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మాకెలాంటి సంబంధం లేదు: కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు
‘‘ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీచేసిన అంశంతో మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పెద్ద కుంభకోణం. ఇందులో భారీ అవినీతి జరిగింది. కవితకు నోటీసులు ఇచ్చిన విషయం నాకు తెలియదు. తెలుసుకోవాలనే ఆసక్తి కూడా లేదు. ఈడీ తన దర్యాప్తులో భాగంగా ఎవరికి నోటీసులు ఇస్తుందో మాకేం సంబంధం. ఢిల్లీకి సంబంధించిన ఆ వ్యవహారంతో బీజేపీ కేంద్ర నాయకత్వానికి, తెలంగాణ లీడర్‌షిప్‌కుగానీ ఎలాంటి సంబంధం లేదు.’’