పటాన్‌చెరులో ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న BJP అభ్యర్థి కుమారుడు (వీడియో)

by GSrikanth |   ( Updated:2023-12-15 17:18:11.0  )
పటాన్‌చెరులో ఉద్రిక్తత.. ఒంటిపై పెట్రోల్ పోసుకున్న BJP అభ్యర్థి కుమారుడు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లా పటాన్‌‌చెరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. పటాన్ చెరు బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ తన అనుచరులు, కుటుంబ సభ్యులతో పీఎస్ ఎదుట ఆందోళనకు దిగారు. నియోజకవర్గ కేంద్రంలోని మైదానంలో ఛట్ పూజ చేసేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థి నందీశ్వర్ గౌడ్, బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో ఆందోళనలో భాగంగా నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.

Advertisement

Next Story