పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి

by GSrikanth |
పార్టీ మార్పు వార్తలపై స్పందించిన కోమటిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ పార్టీ అవకాశమిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ ఘట్కేసర్‌లో శుక్రవారం జరిగిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఆయన పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ మార్పు అనేది ప్రచారమే నన్నారు. తుదిశ్వాస వరకు బీజేపీలోనే ఉంటానని వెల్లడించారు. కావాలని, పనిగట్టుకొని కొంతమంది ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ చేస్తానని, ఏ బాధ్యత అప్పగించినా పనిచేస్తానని అన్నారు.

Advertisement

Next Story