- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలమూరు సభలో ప్రధాని పాల్గొంటారు: కిషన్ రెడ్డి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: బేగంపేటలోని సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 1వ తేదీన శంకుస్థాపన చేయనున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఆదివారం కిషన్ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. శంకుస్థాపన అనంతరం పాలమూరులో నిర్వహించబోయే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని తెలిపారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలో టీఎస్‌పీఎస్‌సీ పూర్తిగా విఫలం అయిందని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరుగడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగులు అప్పులు చేసి.. నగరాల్లో ఉంటూ కోచింగ్‌లు తీసుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాలు భర్తీ కాకుండా సీఎం కేసీఆర్ కుట్ర చేస్తు్న్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story