- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అధ్యక్షుడిగా తిరిగి బండి సంజయ్‌నే కొనసాగించాలి’
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా తిరిగి బండి సంజయ్ కుమార్‌నే కొనసాగించాలని బీజేపీ బూత్ కమిటీ బాధ్యులు తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తిరిగి బండి సంజయ్‌ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని, ఈ మేరకు హైకమాండ్‌కు వివరించాలని రాష్ట్ర కార్యాలయానికి రిక్వెస్ట్ చేస్తున్నారు.
ఈ నెల 25వ తేదీన దీన్ దయాళ్ జయంతిని పురస్కరించుకుని ఆయా బూత్‌ల వారీగా నివాళులర్పించడంతో పాటు ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటాలని బీజేపీ నిర్ణయించింది. అందులో భాగంగా బూత్ కమిటీ బాధ్యులకు రాష్ట్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. కాగా వారి నుంచి షాకింగ్ సమాధానాలు రావడంతో రాష్ట్ర పార్టీ విస్తుపోయింది. కిషన్ రెడ్డి వల్ల పార్టీ అంతా అంగడి అంగడి అవుతోందని, ఈ విషయాన్ని హైకమాండ్‌కు సూచించాలని వారు స్పష్టం చేశారు. సంజయ్ ఉంటేనే పార్టీ ఫామ్‌లోకి వస్తుందని, కిషన్ రెడ్డి వల్ల పార్టీ కింద పడిపోతోందని విమర్శించడం గమనార్హం.