- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'దోచుకోవడం తెలుసు కానీ పనులు చేయడం తెలియదా?'
దిశ, డైనమిక్ బ్యూరో: సీఎం కేసీఆర్‌కు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయడం చేతకాకనే ఆ నిందను కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. సోమవారం ప్రజాప్రస్థానం యాత్రలో భాగంగా మాట్లాడిన ఆమె ముఖ్యమంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పాలమూరు అంటే కేసీఆర్‌కు చిన్నచూపని బీజేపీతో జోస్తీ కట్టినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు తేల్చుకోలేదని ప్రశ్నించారు. ప్రాజెక్టుకు సంబందించిన కీలకమైన మీటింగ్‌లకు ఎందుకు డుమ్మా కొట్టారని నిలదీసింది. ప్రాజెక్టు వ్యయం పెంచి, కమీషన్లు దోచుకోవడం తెలుసు కానీ పనులు చేయడం తెలియదా? అని ప్రశ్నించింది. పాలమూరును దత్తత తీసుకుంటానని ముఖ్యమంత్రి దొంగ మాటలు చెప్పారని, ఎనిమిదేళ్లలో కృష్ణానది మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టలేదని విమర్శించారు. జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీళ్లు అందివ్వని కేసీఆర్ పాలమూరు ద్రోహిగా మిగిలారని ఫైర్ అయ్యారు.
పాలమూరు అంటే KCRకు చిన్నచూపు. ఎనిమిదేండ్లుగా పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేయకపోవడం సిగ్గుచేటు. KCRకు చేతకాకనే కేంద్రం మీద నెట్టే ప్రయత్నం చేస్తుండు.BJPతో దోస్తీ కట్టినప్పుడు ఈ ప్రాజెక్టు గురించి ఎందుకు తేల్చుకోలే?ప్రాజెక్టు మీటింగులకు ఎందుకు డుమ్మా కొట్టావ్? 1/2#PrajaPrasthanam pic.twitter.com/KT2pRiTPLd
— YS Sharmila (@realyssharmila) August 29, 2022