Yadadri: యాదాద్రి స్వర్ణ తాపడం డిజైన్ సిద్ధం..! నెట్టింట్లో ఫొటోలు వైరల్

by Shiva |
Yadadri: యాదాద్రి స్వర్ణ తాపడం డిజైన్ సిద్ధం..! నెట్టింట్లో ఫొటోలు వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం (Yadadri Lakshminarasimha Swamy Temple) పుత్తడి సొగసును సంతరించుకోబోతోంది. ఈ మేరకు ప్రధాన ఆలయ రాజగోపురానికి బంగారు తాపడాన్ని (Gold Coating) వేయనున్నారు. అయితే, అందుకు సంబంధించి ఇప్పటికే ఓ డిజైన్‌ను కూడా అధికారులు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha), ఇతర ఉన్నతాధికారులు జరిపిన సమీక్షా సమావేశంలో యాదాద్రి (Yadadri) ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై సమగ్రంగా చర్చించారు. ముందుగా 127 కిలోల బంగారంతో బంగారు తాపడానన్ని తయారు చేయాలని నిర్ణయించారు. కానీ, కొన్ని కారణాల చేత బంగారం బరువును 65 కిలోకు తగ్గించారు. అయితే, దేశ వ్యాప్తంగా విరాళాల (Donations) ద్వారా ఇప్పటి వరకు ఆలయానికి 11.5 కిలోల బంగారం, రూ.20 కోట్ల నగదు కానుకలు వచ్చినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. బంగారు తాపడం పనులపై సమగ్ర సమాచారం త్వరలోనే వెల్లడిస్తామని ఆలయ అధికారులు పేర్కొన్నారు.

కాగా, భక్తుల నుంచి వచ్చిన బంగారు కానుకలను ప్యూర్ గోల్డ్ చేయడం, అదేవిధంగా వెండి ఆభరణాలను కొలిమిల్లో కరిగించి అందుకు సమాన ఎత్తులో 25 కిలోల బంగారాన్ని మింట్‌ నుంచి తీసుకోనున్నారు. 10,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న రాజగోపురానికి బంగారు తాపడం వేసే పనులకు అధికారులు వ్యయాన్ని ఇప్పటికే అంచనా వేశారు. మొత్తం పనులు పూర్తి అయ్యేందుకు గాను రూ.6 కోట్ల వరకు మేకింగ్‌ చార్జీలు అవుతాయని అధికారులు వెల్లడించారు. గ్లోబల్‌ టెండర్ ప్రక్రియలో ఎవరు తక్కువగా కోట్ చేస్తే.. వారికి బంగారు తాపడం పనులను అప్పగించనున్నారు.

Next Story

Most Viewed