కథ రాయడానికే అన్ని కోట్ల.. ‘RC16’పై హైప్ పెంచేస్తున్న తాజా అప్‌డేట్

by sudharani |
కథ రాయడానికే అన్ని కోట్ల.. ‘RC16’పై హైప్ పెంచేస్తున్న తాజా అప్‌డేట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ మూవీతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా.. రామ్ చరణ్ తన ‘RC16’ కోసం రెడీ అవుతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాడు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నిజానికి ఈ కాంబినేషన్‌కి ఉన్న క్రేజ్ కారణంగా.. ‘గేమ్ చేంజర్’ సినిమా కంటే కూడా ఫ్యాన్స్ ‘RC16’పై హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు తాజాగా వైరల్ అవుతున్న న్యూస్‌తో ఈ ఎక్స్‌పెక్టేషన్స్ మరింత పెరిగేలా ఉన్నాయి.

ఈ మేరకు ఫిలిమ్ వర్గాల నుంచి అందుకున్న సమాచారం మేరకు.. ‘RC16’ స్క్రిప్ట్‌పై మేకర్స్ భారీగా ఖర్చు చేస్తు్న్నారని తెలుస్తోంది. అంతే కాకుండా కేవలం కథ రాయడానికే ఏకంగా రూ. 3కోట్లు వెచ్చిస్తున్నారని సమాచారం. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం అనుభవజ్ఞులైన రచయితల బృందం పనిచేస్తోందట. ఇక అనుకున్నంత రేంజ్‌లో స్క్రిప్ట్‌ను రెడీ చేసి.. ఈ నెలలోనే షూటింగ్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట చిత్ర బృందం. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. స్క్రిప్ట్‌కే అన్ని కోట్లు అయితే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అంటున్నారు నెటిజన్లు. కాగా.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ‘RC16’ కోసం రామ్ చరణ్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed