- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Teacher, Graduate Voters: పెరిగిన ‘టీచర్, గ్రాడ్యుయేట్’ ఓటర్లు.. కరీంనగర్ పట్టభద్రుల సెగ్మెంట్లో 3.41 లక్షలు
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో త్వరలో పదవీ కాలం ముగియనున్న కరీంనగర్ గ్రాడ్యుయేట్, టీచర్స్, నల్లగొండ టీచర్స్ ఎమ్మెల్సీ తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. గతంలో కంటే ఓటర్లు పెరిగినట్లు వెల్లడించింది. కరీంనగర్, నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు రఘోత్తం, నర్సి రెడ్డి, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పదవీ కాలం 2025 మార్చి చివర్లో ముగియనున్నది. ఖాళీ అవుతున్న ఈ మూడు స్థానాలకు ఫిబ్రవరి రెండోవారం తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల, మార్చిలో ఎన్నికలు జరిగే అవకాశమున్నది. కరీంనగర్ టీచర్ నియోజకవర్గంలో 25,921 ఓటర్లు, నల్లగొండ టీచర్స్ నియోజకవర్గంలో 24,905 ఓటర్లు ఉన్నారు. కాగా, ఈ రెండు సెగ్మెంట్లలోనూ గతంలో కంటే రెండు వేల మంది ఓటర్లు పెరిగారు. కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.41 లక్షల మంది ఓటర్లు ఉండగా, గతంలో కంటే 27 వేల మంది ఓటర్లు పెరిగారు.
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభధ్రుల నియోజకవర్గం ఓటర్లు
మొత్తం ఓటర్లు - 3,41,313
పురుషులు - 2,18,060
మహిళలు - 1,23,250
ట్రాన్స్ జెండర్స్ - 3
పోలింగ్ కేంద్రాలు - 499
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం
మొత్తం ఓటర్లు - 25,921
పురుషులు - 16,364
మహిళలు - 9,557
పోలింగ్ కేంద్రాలు - 274
వరంగల్ ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గం
మొత్తం ఓటర్లు - 24,905
పురుషులు - 14,940
మహిళలు - 9,965
పోలింగ్ కేంద్రాలు - 200