DEET: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి డీఈఈటీ

by Shiva |
DEET: నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. అందుబాటులోకి డీఈఈటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: నూతన సంవత్సరం వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని ఇప్పటికే ప్రభుత్వం చెప్పింది. చెప్పినట్లుగానే ఆ దిశగా ప్రణాళికలు రచిస్తున్నది. ఇందులో భాగంగానే.. రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఇండస్ట్రీస్ డిపార్ట్‌మెంట్ కొత్తగా ఏఐ ఆధారిత డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. నిరుద్యోగులకు, సదరు కంపెనీలకు మధ్య వారధిగా డీఈఈటీని రాష్ట్ర సర్కార్ సిద్ధం చేసింది.

ఎప్పటికప్పుడు సమాచారం అప్‌డేట్

నిరుద్యోగ యువతకు ఉన్న నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ ప్రత్యేక డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా దీనిని ప్రారంభించింది. దీంతో రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు సంస్థల్లో నిరంతరం ఉద్యోగాల కల్పన కోసం ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్‌తో కూడిన డీఈఈటీ అంతర్జాతీయ వేదికను సీఎం రేవంత్​రెడ్డి ఈ నెల 4వ తేదీన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఉద్యోగావకాశాలు, స్కిల్ ప్రోగ్రామ్స్‌తోపాటు అన్నీ ఒకేచోట డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక యాప్‌ను రూపొందించిన ప్రభుత్వం వివిధ కంపెనీలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలను అలాగే అప్రెంటీస్ షిప్, ఇంటర్న్ షిప్ తదితర వివరాలను ఈ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అందుబాటులోకి తెస్తుంది. వివిధ కంపెనీల అవసరాలకు తగ్గట్టు ఎప్పటికప్పుడు స్టే్‌ట్‌మెంట్లు ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేసుకుంటాయి.

అందుబాటులో మరిన్ని వివరాలు

నిరుద్యోగులతోపాటు ఫైనల్ ఇయర్‌లో ఉన్న విద్యార్థులు తమ పూర్తి వివరాలను ఇందులో నమోదు చేసుకోవడం ద్వారా సులభంగా ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు కంపెనీలు తమ అవసరాలకు తగిన ఉపాధి అవకాశాలకు సంబంధించి మెస్సేజెస్, ఈ మెయిల్స్ పంపించడంతోపాటు కాల్స్ కూడా చేసి ఇంటర్వ్యూలకు పిలుస్తారు. నిరుద్యోగులకు, కంపెనీలకు మధ్య వారధిగా ఉండే డీఈఈటీ ద్వారా నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు అటెండ్ కావచ్చు. ఈ పోర్టల్ ద్వారా ఇటు ఉద్యోగాలు కోరుకునే వారికి మాత్రమే కాకుండా, ఉద్యోగాలు ఇచ్చే వారికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన స్కిల్స్ ఉన్న వారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు వెసులుబాటు దొరుకుతుంది.

ప్లే స్టోర్‌లో అందుబాటులో యాప్..

- ప్రస్తుతం యాప్ ప్లే స్టోర్‌లో డీఈఈటీ పేరిట అందుబాటులో ఉంది.

- దీనిని డౌన్‌లోడ్​చేసుకొని ఉద్యోగం కోసం సైన్‌ఇన్ అవ్వాల్సి.

- అందులో వారు అడిగిన ప్రొఫైల్ డేటాను పూరించి దరఖాస్తులను సమర్పించుకోవాలి.

- యాప్‌లో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాలనుకుంటున్న ఉద్యోగాలను సెర్చ్‌లో చూడాలి.

- వీటితోపాటే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు కూడా ఈ యాప్‌లో ఉంటాయి. వాటిని కూడా తీసుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed