- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మున్సిపాలిటీల్లో మరో ఆరు నెలల్లో ఎలక్షన్స్ పూర్తయ్యే ఛాన్స్
దిశ, పల్నాడు: కూటమి ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న మున్సిపాలిటీలకు ఎన్నికలను నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆయా పురపాలక సంఘాలకు అందకపోవడంతో, అభివృద్ధి కుంటుపడుతుంది. ఇందుకు ఎన్నికల నిర్వహించడం ఒక్కటే మార్గమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు కసరత్తు కూడా ప్రారంభించినట్లు సమాచారం. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఆరు నెలల్లోనే ఎన్నికలు నిర్వహిస్తారు.
గుంటూరు జిల్లాలో వాయిదాపడిన ఎన్నికలు ఇవే..
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు. గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 2021లో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించగా, వివిధ కారణాలతో నరసరావుపేట, బాపట్ల, పొన్నూరుకు వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాలేదు. ఆయా మున్సిపాలిటీల్లో సమీప గ్రామాలను విలీనం చేయడమే కాకుండా, ఇష్టారాజ్యంగా వార్డులను విభజించారని ఆరోపిస్తూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిలిచిపోవడంతో కేంద్ర నుంచి రావాల్సి నిధులు అందడం లేదు.
రూ.10 కోట్లు ఆగిపోయాయి..
2022-23 ఆర్థిక ఏడాదికి సంబంధించి రెండో విడతగా నరసరావుపేటకు రూ.3.79 కోట్లు, బాపట్లకు రూ.3.16 కోట్లు, పొన్నూరుకు రూ.1.96 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఆ తర్వాత మూడో విడత కూడా ఇదే స్థాయిలో నిధులు విడుదల కావాల్సి ఉంది. అయితే ఎన్నికలు నిర్వహించని కారణంగా కేంద్రం నిధులు విడుదల చేయలేదు. దీంతో దాదాపు పది కోట్ల నిధులు రాకుండా ఆగిపోయాయి. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఖజానా నుంచి పెద్ద మొత్తంలో నిధులు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలోనే కనీసం కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయాన్నే మంత్రి నారాయణ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జూన్‌లో ఈ మూడు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం నరసరావుపేట, బాపట్ల జిల్లా కేంద్రాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కోర్టులో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. సత్వరమే ఎన్నికలు నిర్వహించాలని స్థానికుల నుంచి కూడా డిమాండ్ వస్తుంది.